తెలంగాణ

చర్చ ముద్దు..రచ్చ వద్దు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* టిఆర్‌ఎస్ విజయాలను జీర్ణించుకోలేకే ఆరోపణలు
* త్వరలో టిఆర్‌ఎస్‌లో టిడిపి విలీనం
* మీడియా పాయింట్ వద్ధ అధికార పార్టీ సభ్యులు
హైదరాబాద్, మార్చి 10: టిఆర్‌ఎస్ ప్రభుత్వ వరుస విజయాలను జీర్ణించుకోలేక విపక్షాలు అర్థరహితమైన ఆరోపణలు చేస్తున్నాయని ఆ పార్టీ ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. బడ్జెట్ సమావేశాలు సాఫీగా జరిగేందుకు విపక్షాలు అనవసర రచ్చ మాని, చర్చకు సహకరించాలని వారు హితవు పలికారు. ప్రతిపక్ష పార్టీలకు ప్రజాసంక్షేమం పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా, వారు సమవేశాలకు ఆటంకం కలగకుండా సహకరించాలని కోరారు. ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు గంగాధర్‌గౌడ్, రాములు నాయక్, కర్నె ప్రభాకర్‌లు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 45 ఏళ్ల పాటు అధికారంలో ఉండి చేసిన పనులు తమ టిఆర్‌ఎస్ ప్రభుత్వం కేవలం ఇరవై నెలల పాలనలో సాధించిందన్నారు. ఈ నెల 14న అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్ అన్ని వర్గాల ప్రజల ఆమోదం పొందే మేలైన బడ్జెట్‌గా ఉంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే టిడిపి నుంచి 12 మంది ఎమ్మెల్యేలు టిఆర్‌ఎస్‌లో చేరారని, త్వరలోనే తెలంగాణలో టిడిపి పార్టీ టిఆర్‌ఎస్‌లో విలీనం కావటం ఖాయమన్నారు. దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్టేట్‌గా తీర్చిదిద్దటమే ప్రధాన ధ్యేయంగా సర్కారు ముందుకెళ్తుందని వారు తెలిపారు.