సబ్ ఫీచర్

తొక్కే కదాని తినేస్తే.. ప్రాణాలు తీసేస్తుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రసాయనిక మందులతో పండ్లను మగ్గబెడుతున్న నేపధ్యంలో మార్కెట్లో లభ్యమయ్యే ఫలాలను తినాలంటే భయపడే పరిస్థితి నెలకొందని స్వయంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. చెట్టుమీద కాయ పండేందుకు సహజసిద్ధమైన ప్రక్రియ ఒకటి ఉంది. కాలాన్ని బట్టి వేసవిలో మామిడి, శీతాకాలంలో యాపిల్ ఎలా కాస్తాయో అలా ప్రతీ ఫలానికి ఒక సమయం ఉంది. చెట్టులో కాలానుగుణంగా వాతావరణం, ఉష్ణోగ్రత, గాలిలో తేమ ఆధారంగా మార్పులు వస్తుంటాయి. కాయ పండే సీజన్ వచ్చిందంటే చెట్టు దానంతటదే ఇథెలీన్ వాటికి అందజేస్తుంది. ఇథెలీన్ కాయలోకి చేరగానే అందులోని కణజాలం ఎంజైమ్ తయారుచేసి పిండిపదార్థాన్ని చక్కెరగా మార్చేస్తాయి. కాయ చర్మంలోని కణజాలం పిగ్మెంటేషన్ ద్వారా రంగు మారుతుంది. అంటే పండుకు అసలు సిసలు రంగు దానంతటదే వచ్చేస్తుంది. కానీ ఈ ప్రక్రియేదీ జరగకుండానే కాయగా ఉండగానే రైతులు కోసేసి మార్కెట్లకు తరలిస్తున్నారు. వ్యాపారులు రసాయనిక పద్ధతుల్లో వాటిని మగ్గపెట్టేసి అమ్మేస్తుంటారు. అలా పండ్లతో ఆరోగ్యం ఇనుమడించాల్సింది పోయి రోగాలని కొనితెచ్చుకున్నట్లవుతోంది. పిల్లల్లో అయితే ప్రాణాపాయం, ఎదుగుదల తగ్గడం జరుగుతోంది. పండ్లు తినాలంటే కనీసం ఈ జాగ్రత్తలు అవసరం అని గుర్తించండి.
* పండ్లు తప్పనిసరిగా ఫ్లోటింగ్ వాటర్‌లో పూర్తిగా మరకలు తొలగేలా కడగాలి.
* నీళ్ళు ఫోర్సుగా వచ్చే పంపు కింద అయితే విష రసాయనాలు పండ్ల నుంచి దూరమవుతాయి.
* టేబుల్ స్పూన్ ఉప్పు లేదా కొద్దిగా నిమ్మరసం కలిపిన నీటిలో శుభ్రం చేసుకోవడం మంచిది.
* పాత్రలోని నీళ్ళలో వీటిని కడుగుతున్నపుడు ఐదు నుంచి పది నిమిషాల పాటు నానపెట్టాలి.
* అరటిపండు, కమలాపండు.. వీటివి తొక్కే కదాని అజాగ్రత్త పనికిరాదు.
* పరిశుభ్రమైన నీళ్ళతో కడిగి పొడి గుడ్డ లేదా పేపర్ టవల్‌తో తుడిచిన తరువాతే వీటిని వాడుకోవాలి.
* పండ్లకు పగుళ్లున్నా, దెబ్బతగిలినా తినకూడదు.
* కుళ్లిపోయినా, రసాయనాలు పొడి రూపంలో కనిపించినా వాటి జోలికి వెళ్ళవద్దు.
* పగుళ్లతో రసాయనాలు పండ్ల లోపలికి వెళ్తే ఆరోగ్యానికి ఎక్కువ ముప్పు వాటిల్లే అవకాశం వుంది.

-ఎం. హర్షిత