రాష్ట్రీయం

వారి భాషే జుగుప్సాకరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టిడిపి సభ్యులపై ధ్వజమెత్తిన వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 24: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ సభ్యులే అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడారని వైఎస్‌ఆర్‌సిపి శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. టిడిపి సభ్యులు తమను తిడుతుంటే సిఎం చంద్రబాబునాయుడు ముసిముసి నవ్వులు నవ్వుకోవడం దురదృష్టకరమని అన్నారు. వారు దూషణల పర్వం కొనసాగించి తమ పార్టీ సభ్యులపై నిందలు మోపడం, సస్పెన్షన్లు విధించడం దుర్మార్గమని విమర్శించారు. గురువారం నాడిక్కడ ఆయన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ శాసనసభలో తమ పార్టీ శాసనసభ్యురాలు రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేయడంపై తీవ్రంగా స్పందించారు. రోజాను టిడిపి సభ్యురాలు అనిత వినలేని పదజాలంతో దూషించడం వల్ల రోజాకు కోపం వచ్చి ఉండవచ్చని అన్నారు. అనిత మాట్లాడిన అసభ్య మాటల ఫుటేజీని కూడా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం మొన్న అంబేద్కర్‌ను, నిన్న ఎమ్మెల్యే అనితను ఏడిపించిన సిఎం చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు నమోదు చేయాల్సి ఉందని అన్నారు.