ఆంధ్రప్రదేశ్‌

ఎమ్మెల్యే చెవిరెడ్డి విడుదల.. మళ్లీ అరెస్ట్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు: వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శనివారం ఉదయం జైలునుంచి విడుదలైన కొద్దిసేపటికే పోలీసులు మళ్లీ అరెస్ట్ చేశారు. వడమాలపేట పోలీస్ స్టేషన్‌‌లో నమోదైన కేసులో బెయిల్‌‌పై చెవిరెడ్డి విడుదలయ్యారు. కొద్దిసేపటికే ఎంఆర్ పల్లి పోలీసులు తమ స్టేషన్ పరిధిలో మరోకేసు నమోదయ్యిందంటూ అరెస్ట్ చేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలోకి అక్రమంగా ప్రవేశించడమే కాకుండా విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలతో సెక్షన్ 147, 341, 448 కేసులను నమోదు చేశామని ఎంఆర్ పల్లి పోలీసులు మీడియాకు తెలిపారు. ఆగ్రహించిన వైసీపీ కార్యకర్తలు జిల్లా సబ్‌జైలు ఎదుట ఆందోళనకు దిగారు. వెంటనే చెవిరెడ్డిని విడుదల చేయాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు.