అదీ సీక్వెల్ స్కెచ్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆరేళ్ల క్రితం నిఖిల్ హీరోగా చందు మొండేటి తెరకెక్కించిన చిత్రం -కార్తికేయ. చిన్న సినిమాగా థియేటర్లకొచ్చినా -డివోషన్, ఎమోషన్‌కు థ్రిల్లైపోయిన ఆడియన్స్ పెద్ద సినిమా విజయాన్ని కట్టబెట్టారు. సో, కెరీర్ క్రైసిస్ ఎదురైన ప్రతిసారీ -నిఖిల్ ముందుకు కార్తికేయ సీక్వెల్ చర్చ వస్తూనే ఉండేది. ఎలాగైతేనేం మొత్తానికి -కార్తికేయ సీక్వెల్‌కు బీజం కొద్దిరోజుల కిందటే పడింది. చిన్న సినిమాకు పెద్ద సక్సెస్ దక్కడంతో -సీక్వెల్‌ను భారీగానే తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం నిఖిల్ రెండు ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టివున్నాడు. సక్సెస్ఫుల్ డైరెక్టర్ సుకుమార్ బ్రాండ్‌తో వస్తోన్న ‘18 పేజీస్’ ప్రాజెక్టు ఒకటైతే, -ద్వాపరియుగానికి, కలియుగానికి లింకుగావున్న మైథలాజికల్ పాయింట్‌తో తెరకెక్కనున్న ‘కార్తికేయ-2’ మరొకటి. గత ఏడాది చివర్లో వచ్చిన ‘అర్జున్ సురవరం’ ఓకే అనిపించుకుని కొత్త ఊపిరి పోయడంతో -ఈ రెండు ప్రాజెక్టులతో కొత్త మెట్లు ఎక్కాలన్న ఆశతో ఉన్నాడట నిఖిల్. అందుకే కార్తికేయ సీక్వెల్ ప్రాజెక్టుని -ఇండియన్ మూవీస్థాయిలో ఐదు భాషల్లో విడుదల చేసే ప్రణాళికను సిద్ధం చేసుకున్నారట. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడతో పాటు హిందీలోనూ సినిమాను విడుదల చేసే ఆలోచనతోనే ప్రాజెక్టుని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. అన్ని భాషల్లోనూ స్వయంగా డబ్బింగ్ చెప్పేందుకు మానసికంగా సిద్ధమయ్యాననీ నిఖిల్ అంటున్నాడు. సో, రెండు ప్రాజెక్టులు అనుకున్న రేంజ్లో వర్కౌటైతే -నిఖిల్ కెరీర్ కొత్త టర్న్ తీసుకున్నట్టే.