పవన్‌కీ.. పూజే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూజా హెగ్దె కాళ్లను పట్టుకున్న బన్నీ కళ్లు -అల.. హిట్టుతోనే వదిలేశాయి. అదృష్టం మాత్రం ఆమెను వదలడం లేదు. రెండేళ్ల క్రితం చాన్స్‌ల కోసం ఎదురుచూసిన ఈ బుట్టబొమ్మ -ఇప్పుడు టాలీవుడ్‌లో ఏ హీరోకైనా ఏకైక ఆప్షన్ అయిపోయింది. బాలీవుడ్‌లోనూ వరుస జాక్‌పాట్‌లు కొడుతోంది. టాలీవుడ్‌లో అల్లు అర్జున్‌తో అల.. హిట్టుకొట్టింది. ప్రభాస్‌తో జోడీకట్టి జాన్ చేస్తుంది. కుర్ర హీరో అఖిల్ కెరీర్‌ని సెట్ చేయడానికి -మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌కు ఓకే అంది. ఎన్టీఆర్ నెక్ట్స్ ప్రాజెక్టుకి బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. అటు బాలీవుడ్‌లో సల్మాన్ ప్రాజెక్టుకి సైన్ చేసింది. అక్షయ్‌కుమార్‌తో మరోసారి రొమాన్స్ చేయడానికి ప్రాజెక్టుని లైన్‌లో పెట్టుకుంది. వరుస హిట్లు కొడుతున్న బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌తో దర్శకుడు ఫర్హద్ షాజీ తెరకెక్కించనున్న ‘బచ్చన్ పాండే’లో పూజనే హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇన్ని ప్రాజెక్టులతో ఫుల్ బిజీ అయిపోయిన పూజ -తాజాగా పవన్ కల్యాణ్‌తో రొమాన్స్ చేయడానికి హరీశ్ శంకర్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. గతంలో హరీశ్ తెరకెక్కించిన డీజే, గద్దలకొండ గణేష్ చిత్రాల్లో పూజే హీరోయిన్. హరీశ్ -పూజల మధ్య వేవ్‌లెంగ్త్ బాగా కలిసిందని.. సో, పవన్ ప్రాజెక్టుకు పూజనే ఎంపిక చేసుకోవచ్చంటూ కొంతకాలంగా వినిపిస్తోన్న మాట. అయితే వరుస ప్రాజెక్టులతో పూజ బిజీగా ఉంది. అటు పవన్ సైతం వకీల్ సాబ్ పూర్తి చేసి, క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ప్రాజెక్టుని పూర్తి చేయాల్సి ఉంది. పవన్ రెండు ప్రాజెక్టులు పూర్తయ్యేసరికి -తన షెడ్యూల్‌తో పూజ ఫ్రీ అవుతుందని.. సో, ప్రాజెక్టులోకి ఖాయంగా పూజనే తీసుకుంటున్నట్టు సమాచారం. ఒక్కసారిగా వెల్లువెత్తుతోన్న ఆఫర్లు చూస్తుంటే, పూజ సుడి వట్రసుడిలా తిరిగిందని ఇండస్ట్రీ జనాలు చమత్కరిస్తున్నారు.