బిజినెస్

మహీంద్రాలో తగ్గిన ఎల్‌ఐసి వాటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 16: ప్రభుత్వరంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసి).. మహీంద్ర అండ్ మహీంద్రలో (ఎమ్‌అండ్‌ఎమ్) 2 శాతం వాటాను ఉపసంహరించుకుంది. ఈ మేరకు మహీంద్ర అండ్ మహీంద్ర బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు తెలియజేసింది. 2.001 శాతం వాటాను ఎల్‌ఐసి అమ్మేయగా, ఇప్పుడు ఎమ్‌అండ్‌ఎమ్‌లో ఎల్‌ఐసికి 9.958 శాతం వాటా ఉంది. ఇంతకుముందు ఎమ్‌అండ్‌ఎమ్‌లో ఎల్‌ఐసికి 11.959 శాతం వాటా ఉండేది. కాగా, మార్కెట్ లావాదేవీల్లో భాగంగా 1.2 కోట్లకుపైగా షేర్లను ఎల్‌ఐసి విక్రయించిందని ఎమ్‌అండ్‌ఎమ్ తెలియజేసింది. మహీంద్ర గ్రూప్‌లోనేగాక మరెన్నో ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ సంస్థల్లో ఎల్‌ఐసి పెట్టుబడులు పెట్టినది తెలిసిందే.