ఆంధ్రప్రదేశ్‌

అపెక్స్ కమిటీ చేతిలో జీసీసీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 1: విభజన జరిగి నాలుగేళ్లయినా తెలంగాణా, ఆంధ్ర రాష్ట్రాలకు సంబంధించిన జీసీసీ ఆస్తుల పంపకాలు మాత్రం ఇప్పటికీ జరగలేదు. 58:42 నిష్పత్తిలో రెండు రాష్ట్రాల ఆస్తులు పంచాల్సి ఉన్నా దీనికి సంబంధించి కమిటీలు వేయడం, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం, రెండు రాష్ట్రాలకు చెందిన అదికారులు అనేకసార్లు సమావేశాలు కావడం, దీనిపై పరిశీలన చేసి మరీ ఓ నివేదికను తయారు చేయడం వంటివి జరుగుతూనే ఉన్నాయి.
అయితే ఆస్తుల పంపకాలు మాత్రం ఓ కొలిక్కి రావడంలేదు. దీనికి మరికొంత సమయం పట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉద్యోగుల విభజన రెండేళ్ళ కిందటే జరిగిపోయింది. ఆంధ్ర రాష్ట్రంలో కేవలం ఇద్దరు మాత్రం తెలంగాణా ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరి అంగీకారం మీదే విశాఖలో ఉన్న జీసీసీ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తుండగా అదే తెలంగాణాలో మాత్రం అధికార, ఉద్యోగ వర్గాల్లో ఏ ఒక్కరూ ఏపీకి చెందిన వారు లేకపోవడం విశేషం. క్షేత్రస్థాయి నుంచి అధికారుల వరకు ప్రతిఒక్కరూ సంబంధిత రాష్ట్రాల్లో ఉండగా, జీసీసీకి సంబంధించి ఆస్తుల పంపకాలు జరిగితే ఏపీకి రూ.50కోట్లకు పైగానే రావాల్సి ఉంటుంది. అయితే ఇందులో తెలంగాణాకు ఇవ్వాల్సింది పెద్దగా ఉండదని, పేరుకే పంపకాలు తప్పితే ఆర్థికపరమైన లావాదేవీలు నిర్వహించాల్సిన పనే లేదంటూ జీసీసీ యాజమాన్యం కచ్చితంగా చెబుతోంది. విడిపోయిన తరువాత కూడా జీతభత్యాలు, అటవీ ఉత్పత్తులు, జీసీసీ స్టాళ్ళు, కార్యాలయాలు, డిపోల నిర్వహణ, వ్యాపారానికి సంబంధించి కోట్లాది రూపాయల మేర తెలంగాణా ప్రభుత్వం వద్దనే ఉండిపోయినందున తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఉండకపోవచ్చని జీసీసీ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. అయితే వాటాలో ఒక్క పైసా తమకు రావాల్సి ఉన్నా వదులుకునేది లేదంటూ తెలంగాణా నుంచి జీసీసీ యాజమాన్యంపై వత్తిడి పెరుగుతోంది. ఆస్తుల పంపకాలు అంటూ జరిగితే కళ్ళెదుట కనిపించేది విశాఖలో ఉన్న జీసీసీ ప్రధాన కార్యాలయే. సమైక్యాంధ్రాగా ఉన్నపుడు హైదరాబాద్ వెల్ఫేర్ భవన్ మొత్తంలో జీసీసీ రీజనల్ కార్యాలయమే నడిచేది. అది కూడా చిన్నపాటి అద్దె భవనంలో. నాటి నుంచి ఇప్పటి వరకు జీసీసీ ప్రధాన కార్యాలయం విశాఖలోనే ఉన్నందున ఇపుడు తెలంగాణా కళ్ళు దీనిపై పడుతున్నాయి. ఇక వ్యాపారపరంగా గత నాలుగేళ్ళుగా చూస్తే రూ.150 కోట్ల నుంచి క్రమేపీ పెరుగుతూ ఇపుడు దాదాపు రూ.400 కోట్లకు వార్షికాదాయం చేరుకుంది. 13 జిల్లాలతో కూడిన ఏపీలో జీసీసీ వ్యాపారపరంగా వార్షికాదాయం రూ.400 కోట్లు ఉండగా ఇపుడు దీనిని ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు రూ.500 కోట్లపైగానే పెంచుకోవాలని యాజమాన్యం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విధంగా సమైక్యాంధ్రాగా ఉన్నపుడు కంటే విడిపోయిన తరువాత గత నాలుగున్నరేళ్ళుగా చూస్తే వ్యాపార లక్ష్యాలు సాధించడం, జీసీసీ సొంత భవనాల్లో పూర్తిస్థాయిలో ఆధునీకరించుకోవడం ద్వారా ఆర్ధికంగా మరింతగా బలపడుతోంది. అయితే ఆస్తుల పంపకాలు కొలిక్కి వస్తే ఇకపై తెలంగాణాతో పూర్తిస్థాయిలా తెగతెంపులు చేసుకున్నట్టు అవుతుందని జీసీసీ యాజమాన్యం భావిస్తోంది. కాగా ఏపీలో జీసీసీ డిపోలే దాదాపు వెయ్యి వరకు ఉండగా, పలుచోట్ల శీతలగిడ్డంగులున్నాయి. ప్రస్తుతం మార్కెటింగ్, పరిపాలన, ఫైనాన్స్ తదితర విభాగాలతోపాటు జీసీసీ డిపోలు వెయ్యి వరకు నిర్వహించగలుగుతున్నారు. దాదాపు 1200 మంది ఉద్యోగులు సేవలందిస్తున్నారు.