ఆంధ్రప్రదేశ్‌

దళారుల ప్రమేయం లేకుండా లబ్ధిదారులకే స్ర్తినిధి ఫలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 1: దళారుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారులకే స్ర్తి నిధి పథకం ఫలాలు అందేలా తెలుగుదేశం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర స్ర్తి, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత తెలిపారు. గుంటూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ పేద మహిళల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న స్ర్తి నిధి పథకం సత్ఫలితాలను ఇస్తోందన్నారు. మహిళలు స్వయంశక్తితో ఎదిగి ఆర్థిక పరిపుష్టి సాధించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రెండు దశాబ్దాల క్రితమే మహిళల ఆర్థిక స్వాతంత్య్రం కోసం చంద్రబాబు ఏర్పాటు చేసిన డ్వాక్రా సంఘాలు నేడు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. డ్వాక్రా మహిళలకు ఆర్థిక సహకారం అందించి వారి కుటుంబాలకు నెలకు 10 వేల రూపాయల ఆదాయం కల్పించే విధంగా స్ర్తి నిధి పథకం దోహద పడుతుందన్నారు. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న మహిళలకు 48 గంటల్లోనే బీమాతో కూడిన రుణాలను ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. నూతన ఏడాదిలో కూడా అదే స్ఫూర్తిని కొనసాగించి రాష్ట్భ్రావృద్ధికి మహిళలను కీలకశక్తిగా మార్చనున్నామన్నారు. ఈ పథకం గ్రామాలు, పట్టణాల్లోని ఎన్నో కుటుంబాల్లో నూతన వెలుగులు నింపిందన్నారు. ఉపాధితో పాటు కులవృత్తులు, పాడిపరిశ్రమ, చిరువ్యాపారులు రుణాలు పొంది, వాటిని సద్వినియోగం చేసుకుంటున్నారన్నారు. గత ప్రభుత్వ హయాంలో 5.69 లక్షల మంది డ్వాక్రా మహిళలకు స్ర్తినిధి ద్వారా కేవలం రూ. 975 కోట్లు మాత్రమే అప్పుగా ఇవ్వగా, గడిచిన నాలుగున్నరేళ్ల కాలంలో 16.77 లక్షల మందికి రూ. 4,313 కోట్లు వడ్డీలేని రుణాలుగా అందించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో కేవలం రూ. 58 కోట్ల మేర వడ్డీ రాయితీ ఇవ్వగా, టీడీపీ ప్రభుత్వం రూ. 238 కోట్ల మేర వడ్డీ రాయితీ ఇచ్చి ఆదుకుందన్నారు.
చిరు వ్యాపారుల జీవనోపాధి నిమిత్తం 2017 నుండి ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు లక్ష వరకు స్ర్తినిధి నుండి జీవనోపాధి రుణాలు అందజేస్తోందని వివరించారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలకు గాను 1,52,498 మంది మహిళలకు రూ. 179 కోట్ల రుణాలు ఇచ్చామన్నారు. స్ర్తి నిధి రుణ సేవలతో పాటు రుణ సేకరణ, పొదుపు సేవల కోసం అప్పు, బీమా సేవలు, బిజినెస్ కరస్పాండెంట్ సేవలు అందిస్తూ, ఎస్సీ, ఎస్టీ జీవనోపాధికై రుణాలు అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.