ఆంధ్రప్రదేశ్‌

దేశంలోనే అత్యుత్తమ న్యాయస్థానంగా తీర్చిదిద్దాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం): ఆంధ్రప్రదేశ్ హైకోర్టును దేశంలోనే అత్యుత్తమ న్యాయస్ధానంగా తీర్చిదిద్దాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి నూతలపాటి వెంకట రమణ అన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన తాత్కాలిక హైకోర్టు భవనాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. హైకోర్టు చీఫ్ జస్టిస్‌తోపాటు 13మంది జడ్జిల ప్రమాణ స్వీకారం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రితో సహా అందరూ తాత్కాలిక హైకోర్టు ఏర్పాటు చేయనున్న ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఇక్కడ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఎన్‌వి రమణ, ముఖ్యమంత్రి చంద్రబాబు, హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి సి ప్రవీణ్‌కుమార్‌తో కలిసి హైకోర్టు భవన సముదాయాన్ని ప్రారంభించారు. భవనంలోని మొదటి అంతస్తులో చీఫ్ జస్టిస్ ఛాంబర్‌తోపాటు లాంజ్‌ను ప్రారంభించారు. అనంతరం ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జస్టిస్ రమణ మాట్లాడుతూ కోర్టులను ఆదర్శవంతమైన సంస్థగా రూపుదిద్దడంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, ప్రజలు సహకరించి వ్యవహరించినప్పుడే అది సాధ్యమవుతుందన్నారు. హైకోర్టు నిర్వహించాల్సిన విధులు క్లిష్టతరంగా, అదే సమయంలో సున్నితంగా ఉంటాయన్నారు.
వ్యక్తికి వ్యక్తికి, వ్యక్తికి-ప్రభుత్వానికి వచ్చే వ్యాజ్యాలు విచారించి న్యాయాన్ని నిర్ధారించాల్సిన బాధ్యత మనపై ఉందని గుర్తు చేశారు. ఈ కర్తవ్యాన్ని నిష్కర్షగా నిర్వహించాల్సి ఉందని, ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడటమే కాకుండా రాజ్యాంగంలోని అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, తీర్పులు వెల్లడించే సమయంలో న్యాయమూర్తులు స్వతంత్రంగా వ్యవహరించాలన్నారు. న్యాయవ్యవస్థ పట్ల ప్రజలకు గౌరవభావం ఉండేవిధంగా పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచించారు. న్యాయసేవాసంస్థల ప్రతిష్టను పెంపొందించేలా ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు.
ఇది చారిత్రక ఘట్టం: ముఖ్యమంత్రి చంద్రబాబు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా తాను, తొలి గవర్నర్‌గా ఈఎస్‌ఎల్ నరసింహన్, బాధ్యతలు చేపట్టామని, జనవరి 1వ తేదీన రాష్ట్ర నూతన హైకోర్టు ఏర్పడటం, దానికి తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సి ప్రవీణ్‌కుమార్ వ్యవహరించడం చారిత్రాత్మక ఘట్టమన్నారు. ప్రజల వద్దకే న్యాయవ్యవస్థ చేరాలన్నారు. రాష్ట్ర విభజన తర్వాత హైకోర్టు పూర్తి స్ధాయిలో విభజన జరిగిందని భావిస్తున్నట్లు చెప్పారు. ఇక నుంచి స్వంత గడ్డ మీద నుంచే న్యాయపాలన జరుగుతుందని అన్నారు. ఇందుకోసం ప్రభుత్వపరంగా పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. అమరావతిలో హైకోర్టు భవన నిర్మాణాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని త్వరలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌సి ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ నవ్యాంధ్రప్రదేశ్‌లో హైకోర్టు ఏర్పాటుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ సూచనలను పరిగణనలోకి తీసుకోవడం ప్రశంసనీయమంటూ అందుకు కృతఙ్ఞతలు తెలియచేశారు. ఆంద్రప్రదేశ్‌లో తొలి హైకోర్టు గుంటూరు కేంద్రంగా పని చేసిందని తదుపరి 1956లో హైదరాబాద్‌కు తరలించారన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పాటు చేశాక తిరిగి అమరావతి రాజధాని ప్రాంతంలో హైకోర్టు కార్యకలాపాలకు శ్రీకారం చుడుతున్నామన్నారు. 62 ఏళ్ళ తర్వాత తిరిగి విజయవాడలో అమరావతి రాజధాని కేంద్రంగా న్యాయపాలన ప్రారంభం కావడం చారిత్రాత్మక ఘట్టమన్నారు. అనంతరం సుప్రీం కోర్టు జస్టిస్ ఎన్‌వి రమణ, హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రవీణ్‌కుమార్‌ను ముఖ్యమంత్రి శాలువాతో సత్కరించారు. తర్వాత చీఫ్ జస్టిస్ ప్రవీణ్‌కుమార్.. ఎన్‌వి రమణను సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొల్లు రవీంద్ర, దేవినేని ఉమామహేశ్వరరావు, చీఫ్ సెక్రటరీ అనిల్ చంద్ర పునీతా, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ సిహెచ్ మానవేంధ్రనాధ్ రాయ్, నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన హైకోర్టు న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు, జడ్జిలు పాల్గొన్నారు.
న్యాయవ్యవస్థలో అతిపిన్న వయస్సు హైకోర్టు
* సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్
సందేశాన్ని వినిపించిన జస్టిస్ ఎన్‌వీ రమణ
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈరోజు దేశంలోని న్యాయవ్యవస్ధలో అతి పిన్న వయస్సుతో ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ అన్నారు. నూతన హైకోర్టు ప్రారంభం సందర్భంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తన సందేశాన్ని పంపారు. హైకోర్టును ప్రారంభించిన సుప్రీంకోర్టు జస్టిస్ ఎన్‌వి రమణ ఈ సందర్భంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ సందేశాన్ని చదివి వినిపించారు. ఈనెల 21వ తేదీన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ చేతులమీదుగా అమరావతి రాజధానిలో హైకోర్టు భవనాలను ప్రారంభించి పూర్తి స్ధాయిలో న్యాయ కార్యకలాపాలు నిర్వహిస్తామన్నారు.
హైకోర్టు ప్రారంభానికి సుప్రీం చీఫ్ జస్టిస్ వచ్చేందుకు సంసిద్ధంగా ఉన్నారన్నారు. జస్టీస్ ఎన్‌వి రమణ తన ప్రసంగాన్ని ప్రారంభించే ముందు సుప్రీం చీఫ్ జస్టిస్ సందేశాన్ని వినిపించారు. ఈరోజు ఏపీ రాష్ట్ర హైకోర్టు పిన్న వయస్సు కలిగిందన్నారు. మన న్యాయవ్యవస్ధ నిస్సందేహంగా గర్వించదగినదిగా ఉండలన్నారు. ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనపై ఉందని ఆనందంతో మన విధుల్లో భాగస్వాములు కావాలని సందేశంలో తెలియచేశారు. న్యాయ వ్యవస్ధలో న్యాయవాదులు జవాబుదారీగా వ్యవహరించాల్సిన అవశ్యకత ఉందన్నారు. నూతన హైకోర్టు ప్రారంభం సందర్భంగా రంజన్ గగోయ్ తన సందేశంలో శుభాకాంక్షలు తెలిపారు.
చిత్రాలు.. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో తాత్కాలికంగా ఏపీ హైకోర్టును ప్రారంభిస్తున్న జస్టిస్ ఎన్‌వీ రమణ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జస్టిస్ ప్రవీణ్‌కుమార్