'క్లాప్' కొట్టు గురూ!

అప్పుడే పెళ్లా..!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

...అంటోంది అందాల తార, కమల్ ముద్దుల తనయ శృతిహాసన్. స్టార్ కూతురిగా వెండితెరపై అడుగుపెట్టిన ఈ బ్యూటీ తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. చేసిన చిత్రాలు.. ఆయా చిత్రాల్లో వేసిన క్యారెక్టర్స్ అన్నీ వేటికవే భిన్నంగా ఉండటంతో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్‌ని సంపాదించుకుంది. తెలుగు, తమిళ చిత్రాల్లో నటించిన ఈ అమ్మడికి రెండు చోట్లా అభిమానులున్నారు. ఇలా తన రెండు పడవల ప్రయాణాన్ని విజయవంతంగా చేసుకుంటూనే కెరీర్‌లో ముందుకు సాగుతోంది. అయితే ఇటీవల శృతి ఎక్కడికెళ్లినా అందరూ తనను పెళ్లి గురించే ప్రశ్నిస్తున్నారట. ప్రైవేటు కార్యక్రమమైనా, అది సినిమా ఫంక్షన్ అయినా శృతికి ఇలాంటి తలనొప్పి తప్పడంలేదట. నిజమే..మరి! పెళ్లెప్పుడో చెప్పొచ్చుగా మరి అని శృతిని కదిలిస్తే- ‘‘వెండితెరపై అడుగుపెట్టి ఏం సాధించానని నన్ను అప్పుడే పెళ్లి గురించి అడుగుతున్నారు? నాకంటే చాలా మందు వచ్చిన తారలు అనేకమంది ఇంకా పెళ్లి ఊసెత్తకుండానే కెరీర్‌లో పరుగులు పెడుతున్నారు. అలాంటి వారిని అడగండి పెళ్లి గురించి. నన్నడిగితే నేనేం చెప్పను? నాకు ఇంకా చాలా చాలా టైముంది. ఎన్నో చిత్రాలు చేయాలి. మరెన్నో పాత్రలు పోషించాలి. కెరీర్‌లో ఎంతో ముందుకు పోవాలి. ఇవన్నీ నా ముందున్న సవాళ్లే. పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు నేను అందరిలా కాక, ముందుగా మీడియాకే చెబుతాను. ఏదీ దాచుకోను’’అంటూ సుదీర్ఘంగా చెప్పుకొచ్చింది.

-సమీర్