'క్లాప్' కొట్టు గురూ!

ఇద్దరూ..ఇద్దరే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో ఆ ఇద్దరూ..ఇద్దరే! అన్నీ వాళ్లు అనుకున్నట్లే జరుగుతాయి. వాళ్ల రూటే సపరేటు! ఇంతకీ వాళ్లెవరనేగా మీ డౌటు.. అక్కడికే వస్తున్నా... వాళ్లు ఎవరో కాదు.. బాలీవుడ్ బ్యూటీలు దీపికా పదుకొనే, కత్రీనాకైఫ్‌లు. వామ్మో..! అనుకుంటున్నారా? మరి అదే.. క్రేజీ తారలైన వీళ్లు బాలీవుడ్‌లో అగ్ర హీరోల చిత్రాల్లో వారి సరసన ఆడిపాడి కథానాయికలుగా మంచి మార్కుల్నే కొట్టేశారు. దాంతో పాటు వీళ్లు నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ కాసులను కురిపించాయి. ఒకర్ని మించి మరొకరు..చేసే చిత్రాలు..పోషించే పాత్రలు అన్నీ ఓ సంచలనానికే దారితీశాయి. అయితే ఇదంతా ఒక ఎత్తయితే మరో విషయం ఒకటుంది. అదే ఈ ఇద్దరూ ఇప్పుడు కలిసి నటించబోతున్నారని. బాలీవుడ్‌లో ఇప్పుడు ఇదే హాట్ హాట్ టాపిక్ కూడా. తారల మధ్య శత్రుత్వం, స్నేహం ఎప్పుడూ అలానే వుండిపోదు. పరిస్థితుల్ని బట్టి శత్రువులు కూడా అప్పుడప్పుడు మిత్రులైపోతుంటారు. అలాగే మిత్రులు కూడా బద్ధ శత్రువులైపోతారు. ఇప్పుడు అదే జరిగింది వీరిద్దరి విషయంలో. బాలీవుడ్‌ను ఏలుతున్న వీరిద్దరి మధ్య సంబంధాలు బాగా లేవని..ఒకరంటే మరొకరు భగ్గుమంటారని హిందీ చిత్రసీమ కోడై కూస్తోంది. కానీ ఇప్పుడు వీరిద్దరు కలిసి నటించడానికి సిద్ధమైపోయినట్లు సమాచారం. షారుఖ్‌ఖాన్ హీరోగా ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోబోతుందిట. ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలకు చోటుందట. దర్శకుడు ఈ పాత్రలకు దీపికా, కత్రీనా అయితే బావుంటుందనుకున్నాడట. అంతే అనుకున్నదే ఆలస్యం దీని గురించి వీరిద్దరికి చెబితే వెంటనే ఓకే అనేశారట! ‘కాఫీ విత్ కరణ్’ కార్యక్రమంలో కత్రీనాకైఫ్‌పై దీపికా పదుకొనే చేసిన వ్యాఖ్యలు అప్పట్లో ఈ ఇద్దరి మధ్య గొడవకు దారితీసిన విషయం తెలిసిందే. అలాంటిది ఈ ఇద్దరూ ఇప్పుడు ఒకే చిత్రంలో నటించడానికి ముందుకు రావడం వింతగాక మరేమవుతుంది? ట్విస్ట్ అంటే ఇదే మరి!!

-సమీర్