'క్లాప్' కొట్టు గురూ!

దటీజ్..లావణ్య!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లో అప్పుడెప్పుడో వచ్చిన ‘అందాల రాక్షసి’తో రంగ ప్రవేశం చేసిన సొగసరి లావణ్య త్రిపాఠిని తాజాగా వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయినా’దాకా చక్కటి వైవిధ్యమైన పాత్రల్లోనే చూపించారు. ఆమెలోని నటనను వెలికి తీశారే తప్ప లావణ్యలోని మరో కోణాన్ని టచ్ చేయలేకపోయారు. అదే గ్లామర్. పరిశ్రమకు వచ్చిన ప్రతీ కథానాయికగా తొలిసారిగా వెండితెరపై తమ అందాల ఆరబోతనే ప్రదర్శిస్తుంటారు. కానీ అలాంటి అవకాశం లావణ్యను దక్కలేదు. దర్శక, నిర్మాతలు ఆమెను గ్లామర్ గర్ల్‌గా చూపించలేకపోయారు. ఈ విషయం గురించి లావణ్యను కదిలిస్తే- ‘‘ప్చ్.. ఏం చేయను. నాకు వచ్చిన పాత్రలు అలాంటివి. గ్లామర్ డోస్‌లో నా ప్రతిభను చూపించాలని నాకూ ఆశగా వుంది. ఎందుకంటే ఏ వయసులో చేయాల్సిన పాత్రలు ఆ వయసులోనే చేయాలి. త్వరలో ఒకేసారి రెండు చిత్రాలు తెలుగులో విడుదలవబోతున్నాయి. ఆ తర్వాత ఇక అంతా గ్లామరే. మోడ్రన్ డ్రస్సులు, చిట్టిపొట్టి డ్రస్సులు వేసుకోవడం చాలా ఇష్టం. ఇప్పటి వరకు సినిమాల్లో అలా కనిపించే అవకాశం రాలేదు. అందుకే ఆ సరదా బయట తీర్చుకుంటున్నాను. ఒక్క ఛాన్స్ వస్తే నాలోని మోడ్రన్ గర్ల్‌ని చూస్తారు’’అంటూ చెప్పుకొచ్చింది.

సమీర్