'క్లాప్' కొట్టు గురూ!

వాహ్..రాశీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగునాట తన అందచందాలతో అందర్నీ ఆకట్టుకున్న అందాలతార రాశీఖన్నా తన దృష్టిని మలయాళంవైపూ కూడా మరల్చిందట. అతి తక్కువ కాలంలో టాలీవుడ్‌లో యమక్రేజ్‌ని సొంతం చేసుకున్న ఈ బ్యూటీ చూస్తుండగానే అగ్ర హీరోలతో జతకట్టింది. ముఖ్యంగా యువతరం క్రేజీ హీరోలతోనూ చిత్రాలు చేస్తూ కెరీర్‌లో రివ్వున దూసుకెళుతోంది. టాలీవుడ్‌తో పాటు ఇతర భాషల్లోనూ తనేంటో నిరూపించాలనుకుంటుందిట.
తమిళ హీరో విశాల్ తొలిసారి మలయాళ సినీ పరిశ్రమలో ప్రతి నాయకుడిగా అడుగుపెడుతున్నారట. మోహన్‌లాల్ హీరోగా ఉన్ని కృష్ణన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘విలన్’. ఇందులో విశాల్ ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారట. మరోవైపు అందాలతార రాశీఖన్నా ఓ అవినీతి పోలీస్ అధికారిణిగా కనిపించబోతోందని, ఆమె చేయబోయే క్యారెక్టరే ‘విలన్’ అని గుసగుసలు వినిపిస్తున్నాయి. విశాల్, రాశీఖన్నాతో పాటు ఇందులో హన్సిక, శ్రీకాంత్, మంజువారియర్ లాంటి స్టార్స్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమాలపై అందరికీ ఆసక్తి బాగా పెరిగిపోయింది. భారత్‌లోనే తొలిసారి 8కే రిజల్యూషన్ ఫార్మాట్‌లో ఈ చిత్రం తెరకెక్కుతోందిట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కేరళలోని ఎర్నాకుళం పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. మలయాళంలో భారీ బడ్జెట్ చిత్రంగానూ రికార్డు నమోదు చేసుకుంటున్న ఈ చిత్రాన్ని రాక్‌లైన్ ఎంటర్‌టైన్ మెంట్స్ పతాకంపై నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ నిర్మిస్తుండటంతో ఈ చిత్రంపై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. సో..తెలుగునాట యమక్రేజ్‌ని సొంతం చేసుకున్న రాశీఖన్నా ఇక అక్కడ కూడా ఓ వెలుగువెలుగుతుందని అందరూ అంటున్నారు. వాహ్..రాశీ..బెస్ట్ఫా లక్..!!

-సమీర్