'క్లాప్' కొట్టు గురూ!

దటీజ్.. ప్రియాంక!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హాలీవుడ్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి బాగా మారిపోయిందని ఆమె సన్నిహితులే కాదు, తోటి నటిమణులు అక్కసు వెల్లగక్కుకుంటున్నారట. ఇంతకీ ఈ అమ్మడిలో మార్పేమిటో అని ఆరా తీస్తున్నవారెవరికీ అంతు చిక్కకుండా వుంటోందిట. అగ్ర హీరోలందరితో హిందీ చిత్రాల్లో ఆడిపాడిన ఈ ముద్దుగుమ్మ టార్గెట్ ఇక హాలీవుడ్డేనట! బాలీవుడ్‌లో నటిగా తనను తాను నిరూపించుకున్నాక, తన తదుపరి అడుగు హాలీవుడ్‌లో వేసింది. అక్కడ తన ప్రయత్నాల్లో ఏ మాత్రం లోపం లేకుండా అహర్నిశలు శ్రమిస్తూనే వుంది. అలవోకగా మంచి అవకాశాలను రాబట్టుకుంటోంది. అంతేకాదు, నటించే ప్రతీ చిత్రంలోనూ తన పాత్ర పరిధిని ఎప్పటికప్పుడు బెరీజు వేసుకుంటూ ముందుకు సాగిపోతోంది. నటి అన్నాక అన్ని భాషల్లో నటించాలనేది ప్రియాంక ఆశ. ఆ ఆశే ఇప్పుడు ప్రియాంకను హాలీవుడ్‌లో మెరిసేలా చేసింది. అయితే ఇదంతా ఒక ఎత్తయితే.. మార్పునకు కారణమేమిటని కదిలిస్తే- ‘‘బాలీవుడ్‌లో ప్రతాపాన్ని చూపిన మనం హాలీవుడ్‌లోనూ మన ప్రత్యేకతను చాటుకోవాలన్నదే నా తపన. ప్రస్తుతం నా అడుగులు అటువైపునకే కదులుతున్నాయి. యాక్షన్ పాత్రలవైపు నా చూపు నెలకొనివుంది. హాలీవుడ్‌లో యాక్షన్ చిత్రాలకే మంచి డిమాండ్ వుంటుందనేది అందరికీ తెలిసిందే. హాలీవుడ్‌లో బాలీవుడ్ రేంజ్ ఏంటో చూపిస్తా’’నంటూ కాస్త ఆవేశంగానే చెప్పుకొచ్చింది. దటీజ్..ప్రియాంక!!

-సమీర్