'క్లాప్' కొట్టు గురూ!
గ్లామర్ క్వీన్!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బాలీవుడ్‌లోకి ప్రఖ్యాత నటుడు శతృఘ్నసిన్హా తనయగా అడుగుపెట్టినప్పటికీ తనకంటూ ఓ ఇమేజ్ సృష్టించుకోవడానికి ఎంతో కాలం పట్టలేదు. చక్కటి పాత్రలు.. భారీ చిత్రాలు.. మెగా హీరోలు ఇలా ఏ విధంగా చూసినా అన్నీ తనకు కలిసి వచ్చాయి. కెరీర్లో ఉన్నత స్థానానికి ఎదిగింది. అయితే ఎక్కువగా గ్లామర్ పాత్రలపైనే దృష్టి సారించడం వల్ల బాలీవుడ్లో ఇంతటి క్రేజ్‌ని సంపాదించుకుందని తోటి నటీమణులు సోనాక్షిపై అక్కసు వెళ్లగక్కుతున్నారు. అవునా..? అని సోనాక్షిని కదిలిస్తే- ‘‘ఇందులో ఏ మాత్రం నిజం లేదు. అది కేవలం నాపై బురదచల్లే ప్రయత్నమే. నాకు వచ్చిన పాత్రల్లో నచ్చినవి మాత్రమే ఎంపిక చేసుకుంటూ కెరీర్లో ముందుకెళుతున్నా. నటనకు స్కోప్‌వున్న పాత్రలు చేయడం వల్లే నాకు ఇంతటి క్రేజ్ ఏర్పడిందని భావిస్తున్నా. నాకు లభించిన పాత్ర గ్లామర్‌తో కూడుకున్నదా? లేక వైవిధ్యమైనదా? అని నేను పెద్దగా పట్టించుకోను. చేసే క్యారెక్టర్ నాకు ఏ విధమైన పేరును తెచ్చిపెడుతుందని మాత్రమే ఆలోచిస్తాను. అలా ఆలోచించడం వల్లే కెరీర్లో ముందకు పయనించడానికి అవకాశం లభిస్తుంది’’అంటూ చెప్పుకొచ్చింది. దటీజ్... గ్లామర్ క్వీన్!