'క్లాప్' కొట్టు గురూ!
తెరపై మాధురి రియల్‌లైఫ్!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
నిజంగా..నిజం! బాలీవుడ్‌ని తన అందచందాలతో, నటనతో షేక్ చేసిన మాధురి దీక్షిత్ జీవితకథ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అదీ.. హాలీవుడ్లో అంటే ఆశ్చర్యమే మరి! హాలీవుడ్లో బాలీవుడ్ భామల సందడి జోరుగానే సాగుతోంది. అమెరికన్ టీవీ షో ‘క్వాంటికో’ ద్వారా అక్కడి వారిని అలరించింది బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా. ఇప్పుడు ఈ సీరిస్ మూడో భాగంలోనూ నటిస్తోంది. తాజాగా ప్రియాంక ఏకంగా ఓ టీవీ సిరీస్‌ని నిర్మించే పనిలో నిమగ్నమైంది. ప్రముఖ బాలీవుడ్ నటి, ఒకప్పటి అందాల తార మాధురి దీక్షిత్ జీవిత కథని టీవీ సిరీస్‌గా తీసుకురాబోతోంది. ఈ విషయాన్ని ఈ సిరీస్‌కు కథ అందిస్తున్న శ్రీరావ్ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించారు. ఈ సిరీస్‌ను మాధురి దీక్షిత్ భర్త శ్రీరామ్‌తో కలిసి ప్రియాంక నిర్మిస్తోంది. ఈ కార్యక్రమం ఏబీసీ ఛానెల్లో ప్రసారం కానుంది. ఈ విషయం గురించి ప్రియాంక చోప్రా చెబుతూ- ‘‘హాలీవుడ్లో బాలీవుడ్ అంటే ఏంటో ఈ సిరీస్ ద్వారా తెలుపాలనుకుంటున్నాం. ఇప్పటికే అక్కడ మన హవా కొనసాగుతూనే వుంది. ఇలాంటి సిరీస్‌ల ద్వారా మరింత ముందుకు వెళ్లదలచాం. బాలీవుడ్ అంటే మాటలు కాదు, చేతలు ఇలా వుంటాయని నిరూపిస్తాం’’అంటూ ఎంతో ఆనందంగా చెప్పుకొచ్చింది ప్రియాంక!