'క్లాప్' కొట్టు గురూ!

యమజోరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లో ఇప్పుడు రాశీఖన్నా కెరీర్ యమజోరుమీదుంది. ఎవ్వరి నోటా విన్నా రాశీ కబుర్లే కబుర్లు. పరిశ్రమలోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలో యమక్రేజ్‌ని సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. ఎన్నో ఆశలతో వెండితెరపై అడుగుపెట్టే భామలు మరెన్నో కలలుగనడం సర్వసాధారణం. అయితే అందరికీ అదృష్టం కలిసివస్తుందా? అంటే ఆలోచించాల్సిందే. కానీ రాశీఖన్నా విషయంలో మాత్రం అదృష్టం బాగానే కలిసి వస్తోంది. మంచి ప్రాజెక్టులు రాశీ వశమవుతున్నాయి. మరెన్నో చిత్రాలు ఆమె సిగ్నల్ కోసం వేచి చూస్తున్నాయి. ఇంతటి అదృష్టాన్ని సొంతం చేసుకున్న రాశీని కెరీర్ ఎలా అనిపిస్తుంది? అని కదిలిస్తే- ‘‘చాలా హ్యాపీగా వుంది. మంచి చిత్రాలు..మంచి పాత్రలు..మంచి ప్రాజెక్టులు లభిస్తున్నాయి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని టాలీవుడ్‌లో మరింత మంచి పేరుని తెచ్చుకోవాలనుకుంటున్నా. నన్ను ప్రోత్సహిస్తున్న టాలీవుడ్‌కు, తెలుగు ప్రేక్షకులకు నేను ఎంతో రుణపడి వుంటా’’అంటూ చెప్పుకొచ్చింది. దటీజ్..రాశీఖన్నా!!

-సమీర్