'క్లాప్' కొట్టు గురూ!

ప్చ్..నయన!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక సారి శింబు...మరోసారి ప్రభుదేవా..ఇలా అందాల భామ దక్షిణాది స్టార్ నయనతారకు ఎప్పుడూ వార్తల్లో వుండటమే అలవాటుగా మారినట్టుంది. అందుకే కాబోలు.. సినిమా విజయాలతో పాటు లవ్ ఎఫైర్స్‌లోనూ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటోంది. గతంలో ప్రేమలో విఫలమైన ఈ సుందరాంగికి మరోసారి అలాంటి చేదు అనుభవం ఒకటి ఎదురైందట. ప్రేమ ప్రేమ అంటూ గతంలో నయనపై ఎన్నో పుకార్లు షికార్లు చేశాయి. తాజాగా తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో పీకలోతు ప్రేమలో కూరుకుపోయినట్లు ఇటీవల వార్తలు గుప్పుమంటున్నాయి. అంతేకాదు, ఈ ముద్దుగుమ్మ కోసం ఆ దర్శకుడు మతం కూడా మార్చుకోవడమేగాక, వీరిద్దరూ రహస్యంగా వివాహం కూడా చేసుకున్నారని రూమర్స్ కలకలం సృష్టించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాయి. అయితే ఈ కొత్త ప్రేమకథ కూడా మళ్లీ గతంలో మాదిరిగానే విఫలం అయినట్లు సినీ వర్గాలు ఘోషిస్తున్నాయ్..ఏది ఏమైనా నయన ప్రేమకు ఇప్పట్లో ఫుల్‌స్ట్ఫా పడేట్లు కనిపించడం లేదంటున్నారు
ఆమె సన్నిహితులు. ప్చ్..నయన!!

-సమీర్