'క్లాప్' కొట్టు గురూ!
మళ్లీ శ్రీయ!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బాలయ్య వందవ చిత్రం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఏ నటుడికైనా తన వందవ చిత్రం అంటే నిజంగా హాట్ టాపిక్కే మరి! అయితే ఇందులో బాలయ్యకు జోడీగా శ్రీయ నటిస్తున్న సంగతి తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘గౌతమీపుత్ర శాతకర్ణి’లో శ్రీయ ఇద్దరు పిల్లల తల్లిగా కనిపించనుందట. శాతకర్ణి భార్యగా చక్కటి పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకోనుందట. దర్శకుడు శ్రీయ క్యారెక్టర్‌ను చక్కగా మలిచాడని, ఈ పాత్ర ఆమె కెరీర్లో చిరకాలం గుర్తిండి పోయేలా వుంటుందని అందరూ అనుకుంటున్నారు. ‘గోపాల..గోపాల’, బాలీవుడ్ ‘దృశ్యం’ చిత్రాల్లో పిల్లలకు తల్లిగా కనిపించిన శ్రీయ మరోసారి అలాంటి క్యారెక్టర్‌నే ఈ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’లో చేస్తుండటం విశేషమే మరి! ఈ చిత్రంతోనైనా టాలీవుడ్లో మళ్లీ ఇలాంటి పాత్రలతోనైనా బిజీగా మారుతానన్న ఆశ శ్రీయలో వుంది.