'క్లాప్' కొట్టు గురూ!

శ్రుతియా..మజాకా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందాలతార శ్రుతిహాసన్ ఆలోచనలు...అలవాట్లు.. జీవనశైలి...అన్నీ భిన్నంగానే వుంటాయి. ఈ విషయంలో ఇతర తారలకంటే ఈ భామ ముందుంటుంది. అలా వుండబట్టే వెండితెరపై వెలిగిపోతోంది. ‘గబ్బర్ సింగ్’ తర్వాత మరోసారి పవన్‌కళ్యాణ్‌తో జోడీ కడుతోంది. ప్రస్తుతం నాగ చైతన్యతో ‘ప్రేమమ్’లోనూ ఆడి పాడుతోంది. ఎలా వుంది కెరీర్ అని శ్రుతిని కదిలిస్తే- ‘‘చాలా సాఫీగా సాగుతోంది. ఈ విషయంలో నా ప్రయాణం నాదే. నేను ఇతరులెవ్వరి గురించి అస్సలు పట్టించుకోను. అలా పట్టించుకుంటూపోతే మన కెరీర్ ఇక అంతే సంగతులు. ఏ విషయంలోనైనా నాకు కష్టపడటమే తెలుసు. ఫలితం గురించి ఆలోచించను. మనకు వచ్చిన అవకాశానికి పూర్తిగా న్యాయం చేశామా? లేదా? అన్నదే ముఖ్యం. అలా చేయడం వల్ల అందరికీ మంచే జరుగుతుంది. నేను ఏది చేసినా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తాను. అలా చేయడం వల్లే మనమేంటో అందరికీ తెలుస్తుంది. ఇక నా చిత్రాల విషయానికొస్తే నేను వేస్తున్న ప్రతి అడుగు ఆచి తూచి వుంటుంది. తొందరపడే మనస్తత్వం కాదు నాది. మంచి అవకాశాలు... మంచి ప్రోత్సాహం చూస్తుంటే ముచ్చటేస్తుంది. అందుకు ప్రేక్షకులకు, చిత్రసీమకూ నేనెంతో రుణపడి వున్నాను’’అంటూ ఎంతో సంతోషంగా సెలవిచ్చింది శ్రుతి! శ్రుతియా..మజాకా మరి!!

-సమీర్