'క్లాప్' కొట్టు గురూ!

ఆశల పల్లకిలో...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నో ఆశలతో మరెన్నో ఆశయాలతో చిత్రసీమలోకి అడుగుపెట్టిన అందాలతార నికిషాపటేల్‌కు కాలం కలిసిరాలేదు సరికదా..వచ్చిన అనేక అవకాశాలు వెనక్కు వెళ్లిపోయాయి. పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ సరసన ‘పులి’లో మెరుపులు కురిపించిన ఈ బ్యూటీ ఆ చిత్రంతో యువతరం గుండెల్లో కాస్తంత స్థానానే్న సంపాదించుకుంది. అటు తర్వాత అడపా దడపా అవకాశాలు లభించినా ఈ భామ అనుకున్నంత మాత్రం క్రేజ్‌ని సంపాదించుకోలేకపోయింది. తాజా సాయిరామ్ శంకర్‌తో జోడీ కట్టింది. ‘అరుకురోడ్‌లో...’అనే చిత్రంలో అతడితో ఆడిపాడబోతోంది. వాసుదేవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నేటి ట్రెండ్‌కు తగ్గట్టుగా వుంటుందని దర్శకుడు చెబుతున్నారు. అరుకురోడ్‌లో ప్రయాణిస్తున్న ఓ జంటకు ఎదురైన అనుభవాలతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో సాయిరామ్ శంకర్‌తో నికిషా చేసిన విన్యాసాలు అందర్నీ ఆకట్టుకుంటాయని చెబుతున్నారు. ఈ చిత్రం విజయం సాధిస్తే నికిషాపటేల్ అనుకున్న క్రేజ్ వస్తుందేమో చూడాలి మరి!