'క్లాప్' కొట్టు గురూ!

కలిసిరాని కాలం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందాల భామ రెజీనాకు టాలీవుడ్‌లో కాలం కలిసిరావడంలేదట. ఎన్నో ఆశలు... మరెన్నో కోరికలతో తెలుగు చిత్రసీమలో ఓ వెలుగు వెలిగిపోవాలని కలలుగన్న ఈ భామకు నిరాశే ఎదురవుతోందిట. ఆమె తర్వాత వచ్చిన భామలు తనను దాటి ఎంతో ముందుకు వెళ్లిపోతున్నారని.. ఎందుకనో తనకు అవకాశాలు అంతగా రావడంలేదని తెగ బాధపడిపోతుందిట. కెరీర్ ప్రారంభంలో ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉంటాననడం అప్పట్లో ఆఫర్లకు దూరం చేసింది. ఇక ఇక్కడ లాభం లేదనుకుందో..ఏమో.. పక్క భాషలవైపు పరుగులు పెట్టడానికి తెగ తాపత్రయపడిపోతోంది. తెలుగును వదిలి పరభాషల వైపు చూడటం..ఆ తప్పంతా తెలుగు ప్రేక్షకులదే అన్న రీతిలో చెప్పుకొస్తుంది. ‘‘కోలీవుడ్ ప్రేక్షకులు చాలా మంచివారు. ఏడాదికి ఒక్క సినిమా చేసినా సరే వాళ్లు బాగా గుర్తించుకుంటారు. కానీ తెలుగులో వారం వారం ఓ కొత్త హీరోయిన్ పుట్టుకొస్తుంది. అందుకే ప్రేక్షకులు కూడా వారిని తేలిగ్గా మరచిపోతుంటారు. అందుకే నేను కోలీవుడ్‌పై దృష్టి సారించాల్సి వచ్చింది. ఇప్పుడు అక్కక బిజీ అవుతున్నా’’అంది. అయితే ఇదంతా బాగానే వుంది. కానీ తెలుగు పరిశ్రమ కెరీర్ ప్రారంభంలో తనను ఆదరించిన సంగతి అప్పుడే మరిచిపోతే ఎలా? అంటూ ఆమె సన్నిహితులే వాపోతున్నారు. అదీ..సంగతీ!!

-సమీర్