'క్లాప్' కొట్టు గురూ!

హాట్ లేడీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్త్‌లో హాట్ హాట్‌గా నటిస్తూ అందరి మనసులను కొల్లగొడుతున్న బ్యూటీ రాధికా ఆప్టే. ఎప్పటికప్పుడు హాట్‌న్యూస్‌కి కేరాఫ్ అడ్రస్‌గా మారుతూ తనకంటూ ఓ ఇమేజ్‌ని సృష్టించుకుంటోంది. అందరి తారల్లాగాక, తనేమిటో..తన పవరేమిటో వెండితెరకు చూపించాలనుకుంటోంది. అందుకే చేసే ప్రతీ చిత్రమూ, పోషించే ప్రతి క్యారెక్టర్‌లో ఆచి తూచి అడుగులు వేస్తూ తన స్టామినాను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూనే వుంది. ప్రతీ తార పెద్ద సినిమాల్లో నటించాలని ఆశపడటం సహజమే. కానీ రాధికా మాత్రం తనకు నచ్చిన సినిమాల్లోనే కనిపించాలనుకుంటోంది. ఇప్పటికే ఎన్నో విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకుల్లో తన పాపులారిటీని నిలుపుకుంది. అయితే చిన్న సినిమాలంటే రాధికా దృష్టిలో షార్ట్ఫిలింస్ అన్నమాట. అలాంటి చిత్రాల్లో నటించడమంటే తనకు చాలా ఇష్టమని కూడా చెబుతోంది. పెద్ద చిత్రాలు చేతిలో లేనప్పుడు ఖాళీగా ఉండకుండా ఇలాంటి చిత్రాలపై దృష్టిసారిస్తానంటోంది కూడా. అంతేకాదు, అసలు ఇలాంటి చిత్రాల్లోనే ప్రతిభ బయటపడుతుందని, ఇప్పటికే ‘అహల్య’వంటి కొన్ని షార్ట్ ఫిలింస్‌లో అందాల కనువిందు చేసిన ఈ సుందరాంగి ఇప్పుడు కూడా సుజయ్ ఘోష్ తీసే షార్ట్ఫిల్మ్‌లో నటిస్తోందిట. కమర్షియల్ సినిమా అయినా, షార్ట్ఫిల్మ్ అయినా రాధిక స్టయిల్..హాట్ ట్రీట్ ఒకేలా వుంటుందిట. వాహ్..రాధికా ఆప్టే హాట్‌లేడీయే! ఏమంటారు?!

-సమీర్