'క్లాప్' కొట్టు గురూ!

వాహ్..సోనమ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘బాలీవుడ్‌లో ఇప్పుడొస్తున్న చిత్రాలన్నీ ఒకే మూస పద్ధతిలో వుంటున్నాయి. కొత్తదనం మచ్చుకైనా కనిపించడం లేదు. అలా వస్తున్నాయి..ఇలా పోతున్నాయి. ఏవో వేళ్లమీద లెక్కపెట్టుకునే మంచి చిత్రాలు అన్నవి అప్పుడప్పుడు మాత్రమే తొంగిచూస్తున్నాయి’’ అంటోంది అందాలతార సోనమ్‌కపూర్. ఈ భామ ఇటీవల నటించిన చిత్రం ‘నీర్జా’లో ఎయిర్‌హోస్టర్స్ నీర్జా భనోట్ జీవిత కథను వెండితెరపై చూపించారు. ఇందులో చక్కటి నటనను ప్రదర్శించి విమర్శకుల ప్రశంసలందుకుంది సోనమ్. బాలీవుడ్‌లో సోనమ్‌కు ఈ చిత్రం మంచి గుర్తింపుతోపాటు, గొప్ప ఇమేజ్‌ని తెచ్చిపెట్టింది. ఇలాంటి నిజ జీవిత కథలతో వచ్చే చిత్రాల్లో నటించాలన్నదే సోనమ్ కోరికట. ఇలాంటి కథలవైపే ఆమె చూపుకూడా సారించిందట. అవునా..ఇది నిజమేనా? అని సోనమ్‌ని కదిలిస్తే- ‘‘ఎస్...కచ్చితంగా నిజమే. ఇలాంటి కథలే మనకు ఊపిరిపోస్తాయి. కెరీర్‌ని ఎక్కడికో తీసుకెళతాయి. ఎవరూ చేయని పాత్రలే చేయాలనుకుంటున్నా. అలాంటి పాత్రలే మన స్టామినాను తెలియజేస్తాయి’’ అంటూ చెప్పుకొచ్చింది సోనమ్. వాహ్..సోనమ్ రియల్లీ గ్రేట్!

మళ్లీ కోలీవుడ్‌లోకి...
ముందుగా కోలీవుడ్‌లో కొన్ని చిత్రాల్లో నటించిన అందాలభామ రెజీనా అటు తర్వాత టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంది. అయితే తెలుగులో అనుకున్నంత ఇమేజ్ రాకపోగా, కెరీర్ కూడా నత్తనడకనే నడిచింది. తెలుగులో గొప్ప గొప్ప చిత్రాలు చేయాలని, అగ్ర నటులతో ఆడిపాడాలని ఎన్నో కలలుగన్నది. అవన్నీ ఆశ నిరాశలే అయ్యాయి. ఇక లాభం లేదనుకున్న రెజీనా మళ్లీ కోలీవుడ్‌వైపునకు తొంగిచూసింది. ఇప్పటికే నయనతార, త్రిష, హన్సిక, ఆండ్రియాలాంటి భామలంతా హారర్ చిత్రాల్లో దెయ్యాలుగా నటించి మంచి మార్కుల్నే కొట్టేశారు. తాజాగా వారి బాటలోనే రెజీనా కూడా దెయ్యంగా మారిపోయింది. ‘నెంజీ మరప్పదిల్లై’లో ఈ అమ్మడు తాజాగా దెయ్యంగా నటిస్తోంది. ఇంతకు ముందు ‘కేడీ బిల్లా కిలాడీ రంగా’, ‘నిర్ణయం’, ‘రాజమందిరం’లాంటి చిత్రాల్లో నటించిన రెజీనాకు అవేవీ కోలీవుడ్‌లో పెద్దగా గుర్తింపుని తెచ్చిపెట్టలేకపోయాయి. ఇప్పుడు కోలీవుడ్‌లో అనేక చిత్రాలు రెజీనా చేతిలో వున్నాయి. ఇవన్నీ ప్రేక్షకుల ముందుకొస్తే తనేంటో మరోసారి తెలుస్తుందని రెజీనా గట్టిగానే చెబుతోంది. చూద్దాం..ఈ చిత్రాలతో రెజీనా కెరీర్ ఎలాంటి మలుపు తిరుగుతుందో..!!