'క్లాప్' కొట్టు గురూ!

కథలు నచ్చితేనే...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లో ప్రస్తుతం కథల కొరత బాగానే కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. రొటీన్ కథలకు ఫుల్‌స్టాప్ పెట్టకపోతే సినిమా బాక్సాఫీస్ వద్ద భారీగా బోల్తాకొట్టడం ఖాయం అంటున్నారు చిత్రసీమకు చెందిన పెద్దలు. అదే దారిలో నడుస్తుంది యువతరం కథానాయిక కీర్తి సురేష్. ‘నేను శైలజ’తో అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ అమ్మడు అటు తర్వాత ‘నేను లోకల్’తో మరోసారి టాలీవుడ్ వైపునకు చూసింది. అయితే కథలు నచ్చకనే తమిళం వైపు దృష్టి సారించినట్లు చెబుతోంది కూడా. తాజాగా అల్లు అర్జున్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో వస్తున్న సినిమాలో చాన్స్ కొట్టేయడంతో మళ్లీ పరిశ్రమ దృష్టిని ఆకర్షించింది. ‘‘తెలుగులో వస్తున్న కథలు చాలా వరకు మూసగానే వుంటున్నాయి. ఫలితంగా ఆయా చిత్రాలకు పరాజయాలు తప్పడం లేదు. పెద్ద హీరో సరసన అవకాశాలు వస్తున్నాయి కదా అని అన్నీ ఒప్పేసుకుంటే ఇక మన కెరీర్ కూడా అంతే సంగతులు. నేను మాత్రం అందరిలా కాను. నాకు నేనే ప్రత్యేకం. కథలు నచ్చితేనే చిత్రాలకు సై అంటున్నాను. అందులో నా క్యారెక్టర్‌కు కూడా ఎలాంటి ప్రాధాన్యం వుందో చూసుకుంటున్నాను. తొందరపడి పరుగెత్తాలనుకోవడం లేదు’’అంటూ చెప్పుకొచ్చింది కీర్తి. వాహ్..కీర్తి! రియల్లీ..గ్రేట్!!

-సమీర్