'క్లాప్' కొట్టు గురూ!

మకాం మార్చేసింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుస అవకాశాలతో బాలీవుడ్‌లో రివ్వున దూసుకెళుతోంది క్రేజీతార అలియా భట్. యువతరం ప్రేక్షకుల్లో ఆమెకున్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. పేరున్న హీరోలు.. అంతకంటే పాపులారిటీ వున్న బ్యానర్లు.. ఇవి అలియాకు కెరీర్‌లో బాగా కలిసొచ్చాయి. ఇదిలా వుండగా ఈ క్రేజీతార తాజాగా తన మకాం మార్చేసింది. ఈ భామ ఇటీవలే ముంబయిలో ఓ ఇంటిని కొనుగోలు చేసి వార్తల్లో నిలిచింది. అమ్మా నాన్నలకు దూరంగా అలియా ఇలా మకాం మార్చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారట. ఈ విషయం గురించి అలియాని మీడియా ప్రశ్నిస్తే- ‘‘ఇలా చేయడం కూడా మీకు వార్తేనా? నేను ఇంట్లో వాళ్లకి దూరంగా వుండడం లేదు. నాతో మా అక్క వుంటుంది. మా ఫ్యామిలీ అందరూ వారి వారి పనుల్లో బిజీగా వుంటారు. అందరం కలిసి మాట్లాడుకునే అవకాశం ఎప్పుడోగానీ చిక్కదు. ఇలా మారడం వల్ల మాలో ఎలాంటి మార్పులేదు’’అంటూ చెప్పుకొచ్చింది. తాజాగా అలియాభట్.. షారుఖ్‌ఖాన్‌తో గౌరీషిండే దర్శకత్వంలో ‘డియర్ జిందగీ’ చిత్రంలో నటిస్తోంది.

-సమీర్