'క్లాప్' కొట్టు గురూ!

వాహ్..ప్రియాంక!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమాల్లో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా నిలదొక్కుకోవడం చాలా కష్టం. అలా నిలదొక్కుకోవాలంటే ప్రతిభ ఎంతో ముఖ్యం. అలాంటి ప్రతిభతోనే అడుగులు ముందుకేసింది అందాలతార ప్రియాంక చోప్రా. ఈ బ్యూటీ ప్రతిభకు తోడు అందం... అభినయం కూడా తోడయ్యింది. అంతటితో ఆగకుండా బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లోనూ అడుగుపెట్టి సంచనలం సృష్టించింది. చేసిన చిత్రాలు, పోషించిన పాత్రలు ఆమె ప్రతిభను ప్రేక్షకుల ముందుంచాయి. ఇంతకాలం నటిగా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న ఈ అమ్మడు ఇక నిర్మాణ రంగంపై దృష్టిసారించి మరోసారి వార్తల్లో నిలిచింది. నిర్మాతగా మారి ఎన్నో ఆశలతో..మరెన్నో కోరికలతో వెండితెరపైకి రావాలనుకునే నటీనటులకు అవకాశాలు కల్పిస్తోంది. నటిగా విశేషమైన క్రేజ్‌ని సొంతం చేసుకున్న ప్రియాంక నిర్మాతగా ఎందుకు మారిందో అర్థంకాక పరిశ్రమ ఆలోచనలో పడిందట. ఈ విషయం గురించే ప్రియాంకను అడిగితే- ‘‘ అవును. కావాలనే నిర్మాతగా మారా. ఇలా మారడానికి కారణం కొత్తవారికి తనవంతు సహకారంగా మంచి ప్రోత్సాహాన్ని అందించాలనే. చిత్రసీమలో వెలిగిపోవాలని దేశం నలుమూల నుంచి ఎందరెందరో వస్తున్నారు. కానీ పోటీ తీవ్రంగా ఉండడంతో అందరికీ అవకాశాలు దక్కడంలేదు. అలాంటి వారికి నా వంతు సహకారం అందించి, వాళ్లలోని ప్రతిభను వెలికితీయాలని నిర్ణయించుకున్నా. అందుకే ప్రొడక్షన్ సంస్థను స్థాపించి చిత్రాలు నిర్మిస్తున్నా. అందరికీ అవకాశాలు ఇచ్చే విధంగా నా బ్యానర్‌లో భాష, జోనర్‌తో సంబంధం లేకుండా అన్ని రకాలు చిత్రాలు నిర్మించాలనుకుంన్నా’’అని ఎంతో ఆనందంగా చెప్పుకొచ్చింది. ‘వాహ్..ప్రియాంక రియల్లీ గ్రేట్’ అని అనకుండా వుండలేం కదా?!

-సమీర్