శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

సిఎం సభ ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కలిగిరి, జనవరి 1: జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఖరారు కావడంతో మండలంలోని పెద్దపాడు గ్రామంలో ఏర్పాట్లను శుక్రవారం జిల్లా కలెక్టర్ జానకి, ఎస్‌పి గజరావు భూపాల్ పరిశీలించారు. హెలిప్యాడ్ స్థలాన్ని, సభా ప్రాంగణాన్ని కూడా వారు పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. సభ సజావుగా విజయవంతం అయ్యేటట్లుగా చూడాలని కోరారు. వారితో పాటు ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు కూడా ఉన్నారు.

డిఎంహెచ్‌ఓగా వసుంధరం బాధ్యతలు స్వీకరణ
నెల్లూరుసిటీ, జనవరి 1: జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిగా సి వసుంధరం శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో పనిచేసిన ఎడివి లక్ష్మీని 4 నెలలకే బదిలీ చేయడంతో ఆ శాఖపై ప్రజల నుండి పలు విమర్శలు వస్తున్నాయి. మాజీ డిఎంహెచ్‌ఓ పనితీరు సరిగా లేకపోవడంతో అర్హత తగ్గించి బదిలీ చేశారు. దీంతో చిత్తూరులో పనిచేస్తున్న అడిషనల్ డిఎంహెచ్‌ను బదిలీపై నెల్లూరుజిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిగా బదిలీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు తనవంతు కృషి చేస్తానని చెప్పారు. గాడి తప్పిన పరిపాలనను సరిచేసి ప్రజలకు మంచి వైద్య సేవలు అందిస్తానని తెలిపారు. జిల్లాలో ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న ఆరోగ్య సంక్షేమ పథకాలను ప్రజలకు అందించే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పారు. సిబ్బందిలో పలుమార్పులు తీసుకుని వైద్య ఆరోగ్యశాఖపై ప్రజలకు నమ్మకం కలిగే విధంగా చర్యలు తీసుకుంటానన్నారు. అనంతరం సిబ్బంది మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

ప్రజా సంక్షేమమే సిఎం ధ్యేయం
నెల్లూరు , జనవరి 1: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతి పైసా కూడబెట్టి ప్రజాసంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్నారని, అదే సిఎం ధ్యేయమని రాష్ట పురపాలక శాఖామాత్యులు పి నారాయణ స్పష్టం చేశారు. శుక్రవారం నగరంలోని టిడిపి కార్యాలయంలో తెలుగుయువత జిల్లా ప్రధాన కార్యదర్శి జలదంకి సుధాకర్ ఆధ్వర్యంలో 2016 నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేశారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథులుగా మంత్రి పొంగునూరు నారాయణ, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మన జిల్లాకు పరిశ్రమలను తీసుకొస్తూ యువతకు ఉద్యోగాలు కల్పించాలనే ఆలోచనతో చంద్రబాబు ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో డ్వాక్రా రుణాలు, రైతు రుణమాఫీ, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్స్‌లను ఒక్కొక్కటిగా మాఫీ చేస్తున్నారన్నారు. నగర కార్పొరేషన్, గత పాలకుల చేతిలో అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, ప్రస్తుతం తమ పాలనలో అప్పుల నుండి బయట పడిందన్నారు. నగరానికి 11 వందల కోట్లు మంజూరు అయ్యాయని వాటిని రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజి, డ్రింకింగ్ వాటర్ వీటన్నింటికి సంబంధించి త్వరలో టెండర్లు పిలుస్తామన్నారు. ఎల్‌ఇడి లైట్లు నగరంలో ప్రస్తుతానికి 28 వేలకుగాను ఐదు వేలు మాత్రమే వేయాల్సిన లైట్లు మిగిలి ఉన్నాయని, అవి కూడా త్వరలో పూర్తి చేస్తామన్నారు. ప్రస్తుతం నగరానికి యాభై రెండున్నర కోట్ల రూపాయలు సిఎం నిధులు మంజూరు చేశారని, 2016కి ఇది శుభపరిణామమన్నారు. ఇది పూర్తయిన తరువాత కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సహాయ సహకారాలతో మిగతా పనులు పూర్తి అయ్యేటట్లు చేస్తామని తెలిపారు. అండర్ డ్రైనేజి కానివ్వండి, కాలువలపై కట్టడాలు విషయంలో వారికి ఇళ్లు కట్టించిన తరవాతే డ్రైన్స్ తవ్వకాలు మొదలుపెడతామన్నారు. హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ ఆగర్వాల్‌తో సమావేశంలో మాట్లాడామని, ఆయన నగరంలో త్వరితగతిన అరువేల గృహాలు వెంటనే మంజూరు చేయమని చెప్పారన్నారు. మొత్తం పదివేల గృహాలు మంజూరు చేయించి వాటిని నిర్మించిన తరువాత ఆ కాలువలపై ఉన్న వారిని ఖాళీ చేయిస్తామన్నారు. ఇవన్నీ తెలియకుండా ప్రతిపక్షం వారు నోటికొచ్చినట్లు మాట్లాడటం సబబు కాదని తెలిపారు. తన వల్ల ఏదైనా పొరపాటుగా ఆక్రమణలు జరిగి ఉంటే తానే ముందు దానిని తొలగించిన తరువాతే ఆక్రమణలను తొలగిస్తానని తెలియజేశారు. సిఎం చంద్రబాబునాయుడు ఆరోగ్యానికి సంబంధించి ప్రభుత్వ వైద్యశాలలను కార్పొరేట్ వైద్యశాలలుగా తీర్చిదిద్దేందుకు ఐదు పథకాలను త్వరలో ప్రవేశపెడుతున్నారన్నారు. అనంతరం ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మాట్లాడుతూ జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు, మంత్రి నారాయణల చొరవతో ముఖ్యమంత్రిని ఒప్పించి రెండు లక్షల ఎకరాలకు నీరందించేంచేందుకు సన్నద్ధం చేశారన్నారు. ఈ ప్రాంతాన్ని డెల్టాగా చేస్తారని, సాగునీటికి, తాగునీటికి పూర్తిస్థాయిలో అందించేందుకు ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు. తొలుత మంత్రి నారాయణను టిడిపి కార్పొరేటర్లు దుశ్శాలువాలతో, పూలబొకేలతో సత్కరించారు. ఈవేడుకల్లో మేయర్ అబ్దుల్ అజీజ్, టిడిపి నగర అధ్యక్షులు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, కిలారి వెంకటస్వామినాయుడు, టి అనూరాధ, రమేష్‌రెడ్డి, ఎ జానకి, సత్యనాగేశ్వరరావు, శ్రీనివాసులునాయుడు, చేజర్ల వెంకటేశ్వర్లు, పి శైలజ, జడ్ శివప్రసాద్, ఎం మధు, ఉచ్ఛి భువనేశ్వర్‌ప్రసాద్, ఎస్ రవిచంద్ర, డి సుబ్బారావు, రాజేష్, కె శైలజ పాల్గొన్నారు.

కలెక్టర్‌కు శుభాకాంక్షలు తెలిపిన అధికారులు
నెల్లూరు, జనవరి 1: జిల్లా కేంద్రంలోని దర్గామిట్టలో ఉన్న కలెక్టర్ బంగ్లాలో శుక్రవారం ఉదయం నుండి కలెక్టర్‌కు వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, వివిధ శాఖల అసోసియేషన్ ప్రతినిధులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఉదయం నుండి కలెక్టర్ బంగ్లా సందర్శకులతో సందడి చేసింది. కలెక్టర్‌కు శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో జెసి ఎఎండి ఇంతియాజ్, ఎజెసి సాల్మన్ రాజ్‌కుమార్, డిఆర్‌డిఎ పిడి చంద్రవౌళి, డిఆర్వో సుదర్శనరెడ్డి, నగర మేయర్ అబ్దుల్ హజీజ్, నగర కమిషనర్ మూర్తి, పౌర సంబంధాల అధికారి షేక్ లాల్ జాన్ తదితరులు కలెక్టర్‌కు పూలబొకేలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా రెవెన్యూ అసోసియేషన్, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, అసోసియేషన్ నాయకులు, వివిధ మండలాల తహశీల్దార్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, ఈశ్వరీయ బ్రహ్మకుమారి ప్రతినిధులు, జిల్లా విద్యాశాఖాధికారి, పలు ఉపాధ్యాయ సంఘాల, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పోలీస్, ఎక్సైజ్ ఇతర శాఖల ఉన్నతాధికారులు కలెక్టర్‌ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు అందజేశారు.

మహిళ అనుమానాస్పద మృతి
బాలాయపల్లి, జనవరి 1: మండలంలోని కాలగంద గ్రామంలో ఎడెం పెంచలమ్మ(45) అనే మహిళ అనుమానాస్పదరీతిలో మృతి చెందింది. గ్రామస్థుల కధనం మేరకు కాలగంద అరుంధతీయ వాడకు చెందిన పెంచలమ్మ గొర్రెలను కాచేందుకు శుక్రవారం ఉదయం అడవికి వెళ్లింది. సాయంత్రం ఆమె మృతదేహాన్ని గ్రామ సమీపంలో గుర్తించారు. ఈమె మృతి అనుమానాస్పదంగా ఉందని గ్రామస్థులు తెలిపారు.
వాహనం ఢీకొని ఒకరు మృతి
గూడూరు, జనవరి 1: గూడూరు పట్టణ నడిబొడ్డున టవర్ క్లాక్ సెంటర్‌లో శుక్రవారం ఉదయం రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని టాటా ఏస్ వాహనం ఢీకొనడంతో సంఘటనాలో స్థలంలోనే మృతి చెందాడు. అందరూ చూస్తుండగానే ఈ సంఘటన చోటుచేసుకోవడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. గూడూరు టవర్ క్లాక్ సెంటర్ వద్ద పట్టణంలోని దళితవాడకు చెందిన వంగపూరి సుధాకర్ నడిచి వెళుతుండగా వేగంగా వచ్చిన వాహనం ఢీకొనడంతో అతను సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఒకటవ పట్టణ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కారు ఢీకొని వృద్ధుడు మృతి
సంగం, జనవరి 1: మండలంలోని గాంధీజన సంఘం గ్రామానికి చెందిన వృద్ధుడు ఓ గుర్తుతెలియని కారు ఢీకొట్టిన దుర్ఘటనలో మృతిచెందాడు. శుక్రవారం మధ్యాహ్నం గాంధీజన సంఘంకు చెందిన అబ్బూరు వెంకయ్య (60) రోడ్డుపక్కనే చెట్టుకింద పడుకుని ఉండగా గుర్తు తెలియని కారు ఢీకొట్టింది. దీంతో అంకయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

అగాధంలా తవ్వేశారు..
* నివాస మార్గం లేకుండా చేస్తున్నారు
ఆత్మకూరు, జనవరి 1: మండల పరిధిలోని దేపూరు నుంచి అనంతసాగరం మండలం వెంగంపల్లి గ్రామానికి నూతనంగా చేపడుతున్న రోడ్డు నిర్మాణ క్రమంలో అనాలోచిత ధోరణులతో రామస్వామిపల్లి వాసులు అగచాట్లు పడుతున్నారు. రామస్వామపల్లి గ్రామంలోని అంకమ్మ దేవాలయం వెనుక భాగంలో ఐదడుగుల లోతు వరకు సైడ్ వాలు నిర్మాణం అంటూ అగాధంలా తవ్వేశారు. తీరా ఇదేమని స్థానికులు ప్రశ్నిస్తే సైడు వాలు నిర్మాణానికి స్వస్తి పలకాల్సి వస్తోంది. సుదీర్ఘకాలంగా మెయిన్ రోడ్డులో నుంచి వచ్చే తమ నివాసాలకు వెళ్లే మార్గాన్ని కుచించుకుపోయేలా చేస్తున్నారంటూ ఆరోపించడంతో అటు అధికారులు, ఇటు కాంట్రాక్టర్ తరపున ప్రతినిధులు వెనక్కు తగ్గారు. మెయిన్‌రోడ్డుకు ఆనుకుని ఉన్న మార్జిన్‌లో తమ నివాస మార్గానికి సంబంధించి చదునుగా ఉన్న మైదాన ప్రదేశాన్ని భారీ అగాధంగా తవ్వేయడంపై స్థానికులు తప్పుబడుతున్నారు. గుంతగా తవ్వేయడంతో అక్కడ నివాసం ఉంటున్న వారికి అగచాట్లు ఎదురవుతున్నాయి. మరోవైపున తమ పట్టా పొలంలోని చెట్లు ఏకంగా తొలగించి కట్టవ గోడ కంప అంతా తొలగించేశారంటూ స్థానికులు వాపోతున్నారు. దారి అంటూ లేకుండా ఇబ్బందులపాలు చేయడంపై ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆ గ్రామానికి చెందిన కొప్పోలు శ్రీనివాసులురెడ్డి, సుందరరామిరెడ్డి, లక్ష్మీరెడ్డి తదితరులు కోరుతున్నారు.
పంచాయతీరాజ్ ప్రత్యేక ఇంజనీరింగ్ అధికారి వివరణ
సైడ్ వాలు నిర్మాణం నిలిపివేయమని ఆదేశించా.. తవ్విన గుంతను తిరిగి పూడ్చివేయించడంతోపాటు లెవలింగ్ చేపట్టాలని సూచిస్తా.. ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూస్తానన్నారు.

‘బడుగు జీవికి మేలు చేకూరాలి’
కావలి, జనవరి 1: కొత్త సంవత్సరంలో కరవు కాటకాలు లేకుండా బడుగు జీవికి కాలం కలిసొచ్చేలా ఉండాలని గత ఏడాది అనుభవం ఎదురు కారాదంటూ పలువురు నేతలు, అధికారులు ఆకాంక్షించారు. పట్టణ టిడిపి ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ సభ్యులు అమరావేదగిరి గుప్తాను ఆర్‌టిసి కార్మిక సంఘ నేతలు శ్రీనివాసులు, సుధీర్ రెడ్డి, పాండు, శ్రీను, రవి, నవీద్, సుబ్బయ్య తదితరులు ఆయన నివాసానికి వెళ్లి శుక్రవారం ఉదయం అమరా దంపతులను ఘనంగా సత్కరించారు. అలాగే వికలాంగుల సంఘం నాయకులు నాగమణి, వెంకట్, శైలేష్ తదితరులు కలిసి శుభాకాంక్షలు చెప్పారు. ఈసందర్భంగా కార్మిక, వికలాంగుల నాయకులు మాట్లాడుతూ తమకు అన్ని సందర్భాలలో అండగా నిలిచి తమ కార్యక్రమాలకు ఇతోధికంగా సాయపడుతున్న అమరాను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. సమైక్య ఉద్యమ సమయంలో వారి ట్రస్టు నుంచి మొత్తం 500మంది కార్మికులకు 2నెలలు సరిపడే ఫల సరుకుల అందించారని వికలాంగుల కార్యక్రమాలన్నింటికి భోజన వసతి, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారని వారి అండదండలు కొనసాగాలని ఆకాంక్షించారు. అనంతరం నాయకులు అమరా మాట్లాడుతూ తన వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని చెప్పారు.
ఇంటింటికి పండ్లు పంపిణీ
33వ వార్డులో అమరా సతీమణి విజయలక్ష్మి ప్రాతినిద్యం వహిస్తున్న 33వ వార్డులో మొత్తం 900నివాసాలకు వెళ్ళి క్యాలెండర్లు, పండ్లు పంపిణీ చేశారు. కొత్త సంవత్సరంలో ప్రభుత్వపరంగా వచ్చే ప్రతి పథకాన్ని లబ్ధిదారులందరికి అందిస్తామని ఈసందర్భంగా వార్డు ప్రజలకు హామీ ఇచ్చారు. పలువురు వారిని అభినందించారు. ఇందులో అమరాతో పాటు టిడిపి నాయకులు సన్నిబోయిన నారాయణ, ఎస్‌ఎస్‌ఆర్ రవిశేఖర్ తదితరులు ఉన్నారు.