ప్రకాశం

ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం : జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈనెల 4వ తేదీన మార్కాపురం వస్తున్న సందర్భంగా శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ సుజాతశర్మ, జిల్లా ఎస్పీ సిహెచ్ శ్రీకాంత్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కరణం బలరామకృష్ణమూర్తి, మార్కాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జి కందుల నారాయణరెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ముందుగా తర్లుపాడు మండలంలోని శీతానాగులవరం వద్ద హెలీప్యాడ్ ఏర్పాటుచేసి అక్కడే బహిరంగసభ నిర్వహించాలని అధికారులు భావించారు. అయితే బహిరంగ సభను అక్కడ ఏర్పాటు చేస్తే ఇబ్బందులు ఏర్పడతాయని కందుల నారాయణరెడ్డి అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడంతో రాయవరం వద్ద ఏర్పాటు చేసేందుకు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల సమీపంలో హెలీప్యాడ్, బహిరంగ సభా వేదిక ఏర్పాటు చేసేవిధంగా నిర్ణయించారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ రాంప్రకాశ్, మార్కాపురం ఆర్డీఓ కె చంద్రశేఖరరావు, డివైఎస్పీ శ్రీహరిబాబు, ఇన్‌ఛార్జి సిఇఓ బాపిరెడ్డి, విద్యుత్‌శాఖ ఎస్‌ఇ, ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ, నీటిపారుదలశాఖ ఎస్‌ఇ శారదలను కలెక్టర్ సుజాతశర్మ ఆదేశించారు. ఈ పర్యటనలో గిద్దలూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి అన్నా రాంబాబు, మార్కాపురం మున్సిపల్ మాజీ చైర్మన్ జక్కా లక్ష్మీప్రకాశరావు, పలువురు అధికారులు, టిడిపి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.