మహబూబ్‌నగర్

ఎన్నికల ‘కోడ్’ను కచ్చితంగా పాటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జిల్లా వ్యాప్తంగా అమలు * కలెక్టర్ శ్రీదేవి
మహబూబ్‌నగర్, నవంబర్ 27 : జిల్లాలో జరిగే రెండు శాసన మండలి ఎన్నికల నిర్వాహనపై కేంద్ర ఎన్నికల సంఘం వెలువరిచిన నిబంధనలను విదివిధానాలను ఖచ్చితంగా పాటించే విధంగా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ టికె శ్రీదేవి ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ తన క్యాంపు కార్యాలయంలో శాసన మండలి ఎన్నికల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అంతటా ఎన్నికల కోడ్ అమల్లో ఉందని స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ దృష్ట్యా ఎలాంటి విధాన పరమైన నిర్ణయాలు తీసుకోరాదని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు సైతం నిర్వహించరాదని తెలిపారు. మంత్రుల పర్యటనలకు అధికారులు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. ఎన్నికల విదుల్లో పాల్గొనే అధికారులు అత్యంత జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలని తెలిపారు. ఎన్నికల విదులో నిర్లక్ష్యం వహించిన అధికారులపై ప్రజా ప్రాథినిత్య చట్టం 1951 ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి పర్యావేక్షణ కమిటీ విడియో మానిటరింగ్, టీం విడియో సర్వేలైండ్స్ బృందాలు సత్వరమే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మున్సిపాలిటి పరిధిలోని రాజకీయ పార్టీలకు చెందిన బ్యానర్లను, ప్లేక్సిలను తక్షణమే తొలగించాలని ఆదేశించారు. స్థానిక చానల్స్‌లో కెబుల్ ద్వారా ఎన్నికల ప్రచారం గాని స్కోర్లింగ్ రాకుండా పర్యావేక్షించాలని బల్క్, ఎస్‌ఎంఎస్‌లపై నిషేదం ఉంటుందని తెలిపారు. నిఘా బృందాలను పట్టిష్ట పరచాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాలను ఆర్డీఓలు క్షేత్రస్థాయిలో పర్యటించి క్షుణంగా తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ఓటింగ్‌పై అవగాహన కల్పించడానికి ఒకరోజు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. జిల్లాలో ఐదు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఐదు పోలీంగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని మొత్తం 1259 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. పోలీస్ అధికారులు శాంతి భద్రతలను పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. ఓటర్లు తమ ఓటు హక్కును ప్రశాతంగా వినియోగించుకునే విధంగా ప్రశాంత వాతావరణం పోలింగ్ కేంద్రాల దగ్గర ఏర్పాటు చేయాలని అన్నారు. అధికారులు ఎన్నికల నిర్వాహనపై చాలా జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటి నుండే ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఐదు డివిజన్ కేంద్రాలలో ఏర్పాటు చేయనున్న పోలింగ్ కేంద్రాలను తాము సూచించిన ఆర్డీఓలు సత్వరమే వెళ్లి పరిశీలించాలని అవసరమైన సౌకర్యాలపై సూచనలు ఇవ్వాలని ఎదైనా సమస్య ఉంటే పరిష్కరించాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ రాంకిషన్, డిఆర్‌ఓ భాస్కర్, జడ్పిసిఇశ లక్ష్మీనారాయణ, అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్‌రావు, డిఎస్పీ కృష్ణమూర్తి, ఆర్డీఓలు తదితరులు పాల్గొన్నారు.