ఆంధ్రప్రదేశ్‌

ప్రజా విశ్వాసం కోల్పోయిన ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* వైకాపా విప్ అమర్‌నాథ్ రెడ్డి స్పష్టీకరణ
హైదరాబాద్, మార్చి 14: ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం అన్ని వర్గాల విశ్వాసాన్ని పోగొట్టుకున్నందున అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టామని, శాసనసభ్యులంతా అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేయాలని వైఎస్‌ఆర్‌సిపి విప్ అమర్‌నాథ్‌రెడ్డి కోరారు. తమ పార్టీ సభ్యులకు ఆదివారమే సమాచారం అందించామని, ఈ ఉదయమే విప్ జారీ చేశామని వెల్లడించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలే కాకుండా అధికార పక్షంలోని వారు కూడా చంద్రబాబు పాలనపై వ్యతిరేకతతో ఉన్నందున వారు కూడా అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేస్తారని అన్నారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద అమర్‌నాథ్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, చాంద్‌భాషా, శ్రీకాంత్‌రెడ్డి, సురేశ్ తదితరులు మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చకపోగా రెండేళ్ల పాలనలో అన్నీ కుంభకోణాలే జరిగాయని చెప్పారు. తాము అసెంబ్లీలో ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు నిలదీస్తే అందుకు ప్రభుత్వం సహకరించడం లేదని అన్నారు. ఏ వర్గానికి న్యాయం చేయలేకపోయిన చంద్రబాబు ప్రభుత్వానికి రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదని అన్నారు. అవిశ్వాస తీర్మానంపై ఇచ్చిన నోటీసును శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సోమవారం పరిగణనలోకి తీసుకున్నారని, అనంతరం బిఏసిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సభలో చెప్పడం జరిగిందని అన్నారు. అయితే ప్రాధాన్యత కలిగిన అంశం కాబట్టి కొంత సమయం తీసుకుని కనీసం రెండు రోజులైనా చర్చ చేపట్టాలని కోరితే బిఏసిలో అధికార పక్షం తమ వాదనను పక్కన పెట్టిందని అన్నారు. నోటీసు ఇవ్వడం వరకే మీ పని తప్ప ఎన్ని రోజులు చర్చ అనేది స్పీకర్ పరిధిలో ఉంటుందని మా నోరునొక్కే ప్రయత్నం చేశారని అన్నారు. చివరకు ఈ రోజే చర్చను ఐదారు గంటలు మాత్రమే చేపడతామని చెప్పి బిఏసి సమావేశం ముగించారని అన్నారు. దీంతో ఇప్పటికే వైఎస్‌ఆర్‌సిపి సభ్యులందరికీ విప్ జారీ చేశామని అన్నారు.