తెలంగాణ

ఫిరాయంపులపైనే కెసిఆర్ చూపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరవీరుల త్యాగాలకు విలువేది? : గవర్నర్ ప్రసంగంపై శాసనమండలిలో కాంగ్రెస్ ధ్వజం
హైదరాబాద్, మార్చి 12: తెలంగాణ బడ్జెట్ శాసనసభ సమావేశాలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ చేసిన ప్రసంగంపై శాసన మండలిలో శనివారం అధికార, విపక్షాలకు చెందిన సభ్యులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. చైర్మన్ స్వామిగౌడ్ అధ్యక్షతన ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశంలో తొలుత ప్రశ్నోత్తరాల కార్య న్ని నిర్వహించి, మధ్యాహ్నం గవర్నర్ ప్రసంగంపై చైర్మన్ చర్చకు అనుమతించారు. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ మండలి నేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కెసిఆర్ బంగారు తెలంగాణ సాధించటం కన్నా ఎక్కువ సమయం ఇతర ఎమ్మెల్యేలకు గులాబీ కండువాలు కప్పటంలోనే వెచ్చిస్తున్నారని ఆరోపించారు. గవర్నర్ ప్రసంగంలో పస లేదన్నారు. అంతేగాక, ఎంతో మంది తెలంగాణ అమరవీరుల బలిదానంతో రాష్ట్రం సిద్ధించినా, గవర్నర్ ప్రసంగంలో వారి ప్రస్తావన లేకపోవటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు తెలంగాణ కోసం 2వేల మంది ఆత్మబలిదానాలు చేస్తే, ప్రభుత్వం మాత్రం కేవలం 480 మాత్రమేనని లెక్కలు చూపిస్తోందని, ఇదేనా అమరవీరులను స్మరించుకునే విధానం? అని ఆయన ప్రశ్నించారు. ఆ తర్వాత అదే పార్టీకి చెందిన సభ్యురాలు ఆకుల లలిత మాట్లాడుతూ, గవర్నర్ ప్రసంగంలో ఎస్సీ, ఎస్టీ,బిసి, మైనార్టీ, గిరిజనుల ప్రస్తావన లేకపోవడం సబబు కాదన్నారు. ఉపాధి హామీ కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు నిధులను ఎందుకు మంజూరు చేయలేదని ప్రశ్నించారు. అదే విధంగా డబుల్ బెడ్ రూం స్కీం అమలుకు సంబంధించి ఎమ్మెల్యేలకు కోటాని ఫిక్స్ చేసిన ప్రభుత్వం ఎమ్మెల్సీలను మర్చిపోయిందని, మేం ప్రజాప్రతినిధులం కామా? అని ప్రశ్నించారు. దీనిపై సుంకరి రాజు, గంగాధర్‌గౌడ్, ఎం.ఎస్.ప్రభాకర్‌రావు మాట్లాడుతూ, అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు కళ్లు తెరవాలని, ప్రభుత్వంపై విమర్శలు మానుకుని బంగారు తెలంగాణ సాధన కోసం నిర్మాణాత్మక సలహాలివ్వాలని సూచించారు.
నల్గొండలో రౌడీ రాజ్యం..
కాంగ్రెస్ సభ్యుడు రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ, నల్గొండ జిల్లాలో రౌడీరాజ్యం కొనసాగుతోందని ఆరోపించారు. గులాబీ కండవా వేసుకుంటావా? లేదా? అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలను నేరుగా బెదిరిస్తూ అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతోందన్నారు. సోనియాగాంధీ లేకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదా? నేడు కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యేవాడా? అని ఆయన ప్రశ్నించారు. దీంతో మంత్రి జగద్వీశ్ర్రెడ్డి జోక్యం చేసుకుని రాజకీయాల్లో దురదృష్టవశాత్తు రౌడీలు, వ్యాపారులు కూడా వచ్చారన్నారు. అయతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క రాజకీయ కేసు కూడా నమోదు కాకపోవటం నల్గొండ జిల్లాలో రాజకీయ ప్రశాంతతకు నిదర్శనమని చెప్పారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ, సభ్యుడు రాజగోపాల్‌రెడ్డి రౌడీ అనే పదాన్ని వాడటం అందరికి అగౌరవంగా ఉంటుందని, ఆయన వ్యాఖ్యల నుంచి ఆ పదాన్ని తొలగించాలని చైర్మన్ స్వామిగౌడ్‌ను కోరారు. ఈ విషయంమై కాసేపు తెరాస, కాంగ్రెస్ సభ్యుల మధ్య వాదనలు చోటుచేసుకున్నాయి. దీంతో స్వామిగౌడ్ జోక్యం చేసుకుని ఇకపై సభలో ఎవరూ రౌడీ అనే పదాన్ని ఉపయోగించరాదని సూచించారు. ఈ సూచన మేరకు తన వ్యాఖ్యల నుంచి ఆ పదాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు రాజగోపాల్‌రెడ్డి తెలిపారు.