రాష్ట్రీయం

పరువు కోసం కాంగ్రెస్-పట్టుకోసం తెరాస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫలితాన్ని శాసించనున్న తెలుగుదేశం
ఖేడ్ ఉప ఎన్నిక కోసం పార్టీల వ్యూహరచనలు
విస్తృతంగా పర్యటిస్తున్న నేతలు

సంగారెడ్డి, డిసెంబర్ 6: ప్రజాస్వామ్యబద్ధంగా ప్రారంభమైన ఎన్నికల ప్రస్థానం నుంచి మెదక్ జిల్లాలో కంచుకోటగా ఉన్న నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గంలో త్వరలో జరగనున్న ఉప ఎన్నికలో అదే జోరును కొనసాగించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్ పార్టీ ఈ నియోజకవర్గంలో పట్టు సాధించాలనే లక్ష్యంతో వ్యూహరచనలు చేస్తోంది. ఇప్పటికే పలువురు మంత్రులు ఈ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేయడమే కాకుండా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసారు. ఆయా పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. గడచిన సార్వత్రిక ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా పోటీచేసిన పట్లోళ్ల కిష్టారెడ్డి టిఆర్‌ఎస్ అభ్యర్థి భూపాల్‌రెడ్డిపై గెలుపొంది కాంగ్రెస్ పార్టీకి పరువు నిలబెట్టారు. కిష్టారెడ్డి ఆకస్మిక మృతితో ఉప ఎన్నిక అనివార్యం కానుంది. కాంగ్రెస్ పార్టీలో కిష్టారెడ్డి, సురేష్ షెట్కార్ వర్గాలు దాదాపు మూడు దశాబ్దాలుగా విభజించుకుపోయాయి. రెండు వర్గాల మధ్య కుదిరిన రాజీతో ఐదేళ్లకు ఒకసారి రొటేషన్ పద్ధతిలో బరిలోకి దిగేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. నియోజకవర్గాల ఢీలిమిటేషన్‌లో భాగంగా జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం ఏర్పడడంతో సురేష్ షెట్కార్‌ను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బరిలోకి దింపారు. దీంతో కిష్టారెడ్డి, షెట్కార్ వర్గాలు ఏకమై పనిచేసి పార్టీకి ఎదురు దెబ్బ తగలకుండా వ్యవహరించారు. ఉప ఎన్నికలో భాగంగా కిష్టారెడ్డి కుమారుడిని రంగంలోకి దింపాలని కాంగ్రెస్ పెద్దలు నిర్ణయించగా దివంగత కిష్టారెడ్డి భార్యను బరిలోకి దింపితేనే తాము సహకరిస్తామని సురేష్ వర్గం తేల్చిచెప్పింది. దీంతో పార్టీలో మరోమారు విభేదాలు తలెత్తే ప్రమాదం కనిపించడంతో ఎఐసిసి నాయకులు రంగంలోకి దిగారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ రెండు వర్గాలను కూర్చోబెట్టి తిరిగి గతంలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఎన్నికల బరిలో రెండు వర్గాలకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఉప ఎన్నికలో ఫలితాన్ని సాధించేందుకు సురేష్ షెట్కార్ భుజస్కందాలపై భారం ఉంచినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో రెండు వర్గాలు గ్రామాల్లో తిరుగుతూ కాంగ్రెస్ పార్టీకి సహకరించాలని ప్రజలను కోరుతున్నట్లు సమాచారం. కిష్టారెడ్డి సతీమణి గాలెమ్మ సైతం ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఖర్చుకు వెనకాడవద్దని కుటుంబ సభ్యులకు సూచించినట్లు తెలుస్తోంది. అధికార టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి బలహీనతలను ఆసరా చేసుకుని కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందేందుకు వ్యూహరచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలాన్ని దృష్టిలో పెట్టుకుని అధికార టిఆర్‌ఎస్ పార్టీ సైతం నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించింది. టిఆర్‌ఎస్ అభ్యర్థిగా భూపాల్‌రెడ్డిని రంగంలోకి దింపుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. రెండు పర్యాయాలు తన గెలుపుకు అడ్డువచ్చిన తమ్ముడు భూపాల్‌రెడ్డిని ఉప ఎన్నికలో ఓడించడమే లక్ష్యంగా మాజీ ఎమ్మెల్యే ఎం.విజయపాల్‌రెడ్డి టిడిపి అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. దీంతో విజయపాల్‌రెడ్డి ఎవరి ఓట్లను కొల్లగొడతారోనన్న భయం కాంగ్రెస్, టిఆర్‌ఎస్ పార్టీలను పట్టి పీడిస్తోంది. ఫ్యాక్షన్ రాజకీయాలను తలపించే ఖేడ్ నియోజకవర్గం ఓటర్లు మొదటి నుంచి ఎటువైపు ఉన్నారో అదే పద్ధతిని అనుసరించడం పరిపాటి. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడుసున్నా అభివృద్ధిలో అట్టడుగున ఉందని, ఈ నియోజకవర్గాన్ని మరో సిద్దిపేటగా అభివృద్ధి చేస్తానని మంత్రి హరీష్‌రావు పలుమార్లు హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం చేసే అభివృద్ధికి పట్టం కట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడితో హోరాహోరీ ప్రచారం నిర్వహించడంతో ఖేడ్‌లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కనుంది. ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం ఖేడ్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నోటిఫికేషన్ రావచ్చని రాజకీయ విశే్లషకులు అభిప్రాయపడుతున్నారు. రసవత్తరమైన రాజకీయాలకు నారాయణఖేడ్ నియోజకవర్గం మరోమారు నాంది పలకనుందని చెప్పవచ్చు.