బిజినెస్

2015-16 సీజన్‌లో 362 లక్షల బేళ్ల పత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిగుబడిపై సిఎఐ అంచనా
ముంబయి, డిసెంబర్ 31: దేశంలో అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్రారంభమైన 2015-16 పత్తి సీజన్‌లో మొత్తం 362 లక్షల బేళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నట్లు కాటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సిఎఐ) వెల్లడించింది. ఇంతకుముందు అక్టోబర్‌లో వేసిన దిగుబడి అంచనాల కంటే ఇది 8.5 లక్షల బేళ్లు తక్కువని సిఎఐ గురువారం ముంబయిలో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. అంతకుముందు 2014-15 సీజన్‌లో మొత్తం 382.75 లక్షల బేళ్ల దిగుబడి వచ్చిందని, అయితే ఈసారి (2015-15 సీజన్‌లో) పత్తి దిగుబడితో పాటు వినిమయం కూడా తగ్గుతుందని అంచనా వేస్తున్నామని సిఎఐ వివరించింది. 2014-15 సీజన్‌లో 53.50 లక్షల బేళ్ల ఉత్పత్తి సాధించిన ఉత్తర భారతావనిలో ఈ ఏడాది తెల్లదోమ దాడి వలన పత్తి పంటకు నష్టం వాటిల్లడం ఆందోళన కలిగిస్తోందని, దీంతో అక్కడ ప్రస్తుత సీజన్‌లో పత్తి దిగుబడి 43 లక్షల బేళ్లకు తగ్గుతుందని భావిస్తున్నామని సిఎఐ పేర్కొంది.