రాష్ట్రీయం

పిఎస్‌ఎల్‌వి సి-29 రిహార్సల్ విజయవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేపు కౌంట్ డౌన్
సూళ్లూరుపేట, డిసెంబర్ 12: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా వాణిజ్యపరంగా చేపట్టబోయే పిఎస్‌ఎల్‌వి సి-29 రాకెట్ ప్రయోగానికి సంబంధించి షార్‌లో శనివారం రిహార్సల్‌ను విజయవంతంగా నిర్వహించారు. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌లోని తొలి ప్రయోగవేదిక వద్ద ఉదయం తొమ్మిది గంటలకు రాకెట్‌ను ప్రయోగవేదిక నుంచి వెనక్కు తీసుకొచ్చి మరలా యథాప్రకారం ప్రయోగవేదిక వద్దకు తీసుకెళ్లే కార్యక్రమాన్ని శాస్తవ్రేత్తలు విజయవంతంగా చేపట్టారు. ఉదయం తొమ్మిదిగంటలకు నిర్వహించిన ఈ రిహార్సల్స్‌ను సాయంత్రం ఆరుగంటలకు పూర్తి చేశారు. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేష్ సెంటర్ (షార్) నుంచి ఈ నెల 16న సాయంత్రం ఆరుగంటలకు పిఎస్‌ఎల్‌వి సి-29 రాకెట్ ప్రయోగం జరగనుంది. ఈ ప్రయోగం ద్వారా సింగపూర్‌కు చెందిన ఐదు ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ప్రయోగానికి సంబంధించిన మిషన్ రెడీనేస్ రివ్యూ సమావేశం ఆదివారం డాక్టర్ సురేష్ అధ్యక్షతన షార్‌లో జరగనుంది. అదేవిధంగా ప్రయోగానికి సంబంధించి ప్రీ కౌంట్‌డౌన్‌ను కూడా ఆదివారం నిర్వహించనున్నారు. ఇప్పటికే తొలి ప్రయోగ వేదిక వద్ద రాకెట్ నాలుగు దశల అనుసంధానం ప్రక్రియకు సంబంధించి కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. ప్రయోగానికి సంబంధించిన కౌంట్ డౌన్ సోమవారం ఉదయం ఏడుగంటలకు ప్రారంభం కానుంది. (చిత్రం) ప్రయోగవేదికపై ఉన్న
పిఎస్‌ఎల్‌వి సి-29 రాకెట్