క్రైమ్/లీగల్

విహారయాత్రలో విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కదిరి, జనవరి 19: అనంతపురం జిల్లా కదిరి రూరల్ మండల పరిధిలోని చెర్లోపల్లి రిజర్వాయర్ వద్దకు ఆదివారం విహారయాత్రకు వెళ్లిన కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. వివరాలు.. నల్లమాడ మండలం పులగంపల్లికి చెందిన హైదర్‌వలి కుటుంబం కదిరి రూరల్ మండల పరిధిలోని కుమ్మరవాండ్లపల్లిలో నివాసం ఉంటున్నారు. హైదర్‌వలి ఆదివారం భార్య, కుమార్తెలు నౌహిరా (13), నాజీరా (11), బంధువులతో కలిసి చెర్లోపల్లి రిజర్వాయర్ వద్దకు విహారయాత్రకు వెళ్లారు. అక్కడ కాసేపు సంతోషంగా గడిపి భోజనం చేశారు. అనంతరం నౌహిరా, నాజీరా సరదాగా జలాశయంలోకి దిగగా అక్కడ పెద్ద గుంత ఉండడంతో అక్కాచెల్లెళ్లు ఇద్దరూ ఉన్నఫళంగా మునిగిపోయారు. ఈ విషయం తెలిసిన వెంటనే కదిరి డీఎస్పీ షేక్‌లాల్ అహ్మద్, రూరల్ సీఐ నిరంజన్‌రెడ్డి పోలీసు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని జలాశయంలో గాలింపు చర్యలు చేపట్టగా నాజీరా మృతదేహం లభ్యమైంది. నౌహిరా కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.