క్రైమ్/లీగల్

దిశ నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 21: దిశ నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు వైద్య శాఖను ఆదేశించింది. దిశ నిందితుల మృతదేహాలకు ఈ నెల 23వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోగా రీ పోస్టుమార్టం ప్రక్రియను పూర్తి చేయాలని తెలంగాణ హైకోర్టు పేర్కొంది. మృతదేహాలకు ఢిల్లీ ఎయిమ్స్ ఫోరెన్సిక్ నిపుణులతో రీ పోస్టుమార్టం నిర్వహించాలని న్యాయస్థానం ఆదేశించింది. శవపరీక్ష ప్రక్రియను వీడియో చిత్రీకరించాలని పేర్కొంది. శవపరీక్షల అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించాలని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించింది. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌లో వినియోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకుని సీఎస్‌ఎస్‌ఎల్‌కు పంపించాలని సిట్‌ను హైకోర్టు ఆదేశించింది. ఎఫ్‌ఐఆర్, కేసు డైరీ, వాహనాలు, ఆయుధాల రిజిస్టర్ వివరాలు మొత్తం తమ ఆధీనంలో ఉంచాలని సిట్‌ను ఆదేశించింది. ఆధారాలు స్వాధీనం చేసుకుని ఆ వివరాలు అన్నీ కమిషన్‌కు అప్పగించాలని కోర్టు స్పష్టం చేసింది. అంతకుముందు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రావణ్ మృతదేహాల పరిస్థితిపై నివేదిక అందించారు. మృతదేహాలు దాదాపు 50 శాతం కుళ్లిపోయాయని, మైనస్ 2 డిగ్రీల సెల్సియస్ ఫ్రీజర్లలో మృతదేహాలను ఉంచామని పేర్కొన్నారు. మరో వారం పది రోజుల్లో మృతదేహాలు పూర్తిగా కుళ్లిపోతాయని ఆయన పేర్కొన్నారు. దేశంలో ఇతర ఆసుపత్రుల్లో మృతదేహాలను భద్రపరిచేందుకు అవకాశం ఉందా? అని కోర్టు ప్రశ్నించగా, దానికి సంబంధించిన సమాచారం తమ వద్ద లేదని ఆయన పేర్కొన్నారు.