క్రైమ్/లీగల్

మనుమడి చేతిలో నాన్నమ్మ హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమ్‌గల్, మార్చి 1: డబ్బులు అడిగితే ఇవ్వలేదనే కోపంతో నానమ్మను ఓ మనవడు హత్య చేసిన సంఘటన నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలంలో చోటుచేసుకుంది. స్థానిక సీఐ రమణారెడ్డి కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మెండోరా గ్రామ పరిధిలో గల వడ్డెర కాలనీలో కొమిరి లక్ష్మి (62) అనే వృద్ధురాలిని డబ్బులు ఇవ్వలేదనే కోపంతో ఆమె మనవడు గంగాధర్ కర్రతో తలపై గట్టిగా బాదడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి చిన్న కొడుకు నర్సయ్యకు గంగాధర్ కుమారుడు. గంగాధర్ తల్లి అతని చిన్నతనంలోనే మరణించడంతో నానమ్మ వద్ద ఉంటూ పెరిగాడు. ప్రస్తుతం గంగాధర్ ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ప్రతిరోజు మద్యం సేవించి నానమ్మతో గొడవపడేవాడు, వ్యసనాలకు డబ్బులు ఇవ్వాలంటూ వేధించేవాడు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చిన గంగాధర్ డబ్బులు ఇవ్వాలని అడుగగా, అతనిని నానమ్మ లక్ష్మి మందలించింది. దీంతో కోపోద్రిక్తుడైన గంగాధర్ దుడ్డుకర్రతో ఆమె తలపై బాది హత్య చేశాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించామని, నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని సీఐ రమణారెడ్డి తెలిపారు.
*చిత్రం... భీమ్‌గల్ మండలం మెండోరా వడ్డెర కాలనీలో మనవడి చేతిలో హతమైన వృద్ధురాలు కొమిరి లక్ష్మి
మృతదేహాన్ని పరిశీలిస్తున్న భీమ్‌గల్ సీఐ రమణారెడ్డి