క్రైమ్/లీగల్
చోరీ కేసుల్లో ముగ్గురి అరెస్టు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
విజయవాడ (క్రైం), మార్చి 2: రాత్రివేళ ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 8 కేసుల్లో సుమారు 5లక్షల 80వేల రూపాయల విలువైన 186 గ్రాముల బంగారం, 210 గ్రాముల వెండి, నగదు, మూడు మోటారు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డీసీపీ హర్షవర్థనరాజు వివరాలు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తికి చెందిన రాత్లావత్ శంకర్ నాయక్ అలియాస్ శంకర్(25), ఖైరతాబాద్‌కు చెందిన మల్లచెరువు రామారావు(51), రంగారెడ్డి జిల్లా నేరేడ్‌మెట్ట, మేడ్‌చల్‌కు చెందిన కొనూరి శ్రీనివాసరావు(53)లను అరెస్టు చేశారు. నిందితులు పటమట, సత్యనారాయణపురం, ఇబ్రహీంపట్నం, అజిత్‌సింగ్‌నగర్ పోలీస్టేషన్ల పరిధిలో తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని రాత్రివేళ నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నిందితులు చోరీ చేసిన సొత్తును వారి నుంచి కొనూరి శ్రీనివాసరావు కొనుగోలు చేస్తుంటాడని తెలిపారు.