క్రైమ్/లీగల్
విద్వేష ప్రసంగాలపై 4న విచారణ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ: ఢిల్లీలో మత ఘర్షణలకు దారితీసే రీతిలో బీజేపీ నేతలు అనురాగ్ ఠాకూర్, పర్వేష్ వర్మ, కపిల్ మిశ్రా, అభే వర్మలు రెచ్చగొట్టే రీతిలో ప్రసంగాలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో వారిపై ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేయాలంటూ నమోదైన అభ్యర్థనలను ఈనెల 4న విచారించడానికి సుప్రీం కోర్టు సోమవారం అంగీకరించింది.
ఢిల్లీ మత కలహాల్లో 42 మంది మరణించగా వందల సంఖ్యలో పౌరులు గాయాలకు గురైన విషయం తెలిసిందే. 10 మంది అల్లర్ల బాధితులు సుప్రీం కోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డే ఆధ్వర్యంలోని ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టాలని నిర్ణయించింది. ‘ప్రజలు చనిపోవాలని మేము చెప్పడం లేదు. ఇలాంటి కేసుల తక్షణ విచారణకు మా దగ్గర సాధనా సంపత్తి లేదు. ఏదీ జరుగకుండా మేం నిరోధించలేం. అలాగే ముందస్తు వెసులుబాటునూ కల్పించలేం. అలాంటి ఒత్తిళ్లలో మేం పనిచేస్తున్నాం’ అని బాబ్డే పేర్కొన్నారు. బాధితుల పిటిషన్‌ను తక్షణమే విచారించాలన్న సీనియర్ న్యాయవాది కోలిన్ గంజాల్వేజ్ అభ్యర్థనకు సమాధానంగా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఏ సంఘటన అయినా జరిగిన తర్వాతే దానిని కోర్టు విచారణకు చేపట్టగలుగుతుందని అంతేతప్ప అది జరుగకుండా ఆపలేదని ధర్మాసనం పేర్కొంది. తమపై ఒత్తిళ్లను అర్థం చేసుకోవాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. న్యాయస్థానమే బాధ్యురాలు అన్నట్టుగా వార్తాపత్రికల్లో కథనాలు వస్తున్నాయని వ్యాఖ్యానించింది. శాంతినే తాము కోరుకుంటున్నా దానికీ పరిమితులుంటాయని ప్రధాన న్యాయమూర్తి బాబ్డే స్పష్టం చేశారు. పరిస్థితి మరింత దిగజారకుండా మాత్రమే కోర్టు నిరోధించగలుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీ హైకోర్టు ఈ అల్లరకు సంబంధించిన పిటిషన్లను విచారిస్తోందని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేయడంపై మాట్లాడిన గంజాల్వేజ్ ‘ఈ కేసు విచారణను ఢిల్లీ హైకోర్టు ఆరు వారాలు వాయిదా వేసింది. ఇది దిగ్భ్రాంతి కలిగిస్తోంది’ అని అన్నారు. అందుకే సుప్రీం కోర్టు తక్షణ ప్రాతిపదికన బాధిత పిటిషన్‌ను విచారించాలని, మంగళవారంనాడే వీటిని చేపట్టాలని గట్టిగా కోరారు. దానికి జవాబిచ్చిన ధర్మాసనం ‘ఏంచేయగలమో పరిశీలిస్తాం’ అని తెలిపింది.