క్రైమ్/లీగల్
విస్తృత ధర్మాసనానికి ‘నో’
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దుచేయడాన్ని సవాల్ చేస్తూ, కేసును రాజ్యాంగ ధర్మాసనంతో విచారణ చేపట్టాలన్న పిటిషన్లను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఆర్టికల్ 370 రద్దు అంశంపై ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనానికి పంపాలన్న పిటిషనర్ల వాదనతో కోర్టు ఏకీభవించలేదు. న్యాయమూర్తి ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ఐదుగురు జడ్జిలతో కూడిన సుప్రీం బెంచ్ పిటిషన్లను విస్తృత ధర్మాసనానికి పంపాల్సిన కారణాలు కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్(పీయూసీఎల్), జమ్మూకాశ్మీర్ బార్ అసోసియేషన్ తదితరులు రాజ్యాంగ విస్తత ధర్మాసన విచారణకు పంపాలని కోరాయి. ప్రేమ్‌నాథ్ కౌల్ వర్సెస్ జమ్మూకాశ్మీర్ 1959, సంపత్ ప్రకాష్ వర్సెస్ జమ్మూకాశ్మీర్ 1970కు సంబంధించి గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులను పిటిషనర్లు ఉటంకించారు. రెండు కేసుల్లోనూ ఆర్టికల్ 370పై భిన్నమైన తీర్పులు వెలువరించిన నేపథ్యంలో ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనానికి అప్పగించాలని అభ్యర్థించారు. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ విచారిస్తే తగిన న్యాయం జరగదని పిటిషనర్లు అభిప్రాయపడ్డారు. పిటిషనర్ల వాదనతో న్యాయమూర్తులు సంజయ్ కిషన్ కౌల్, ఆర్ సుభాష్ రెడ్డి, బీఆర్ గవాయి, సూర్యకాంత్‌తో కూడిన ఏకీభవించలేదు, ఆ తీర్పుల మధ్య ఎలాంటి సంఘర్షణ లేదని బెంచ్ తేల్చిచెప్పింది. ‘పీయూసీఎల్, బార్ అసోసియేషన్, మధ్యవర్తి పిటిషన్లను తిరస్కరిస్తున్నాం’అని కోర్టు ప్రకటించింది. ప్రేమ్‌నాథ్ కౌల్ కేసులో సుప్రీం కోర్టు తీర్పులో ఎలాంటి వివాదం లేదని బెంచ్ స్పష్టం చేసింది. అలాగే సంపత్ ప్రకాష్ కేసు విషయంలోనూ తీర్పును తప్పుపట్టలేమన్నారు. కేసును విస్తృత ధర్మాసానికి పంపడానికిగల కారణాలు కనిపించడం లేదని న్యాయమూర్తులు పేర్కొన్నారు. జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ ప్రవేటు వ్యక్తులు, న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు, రాజకీయ పార్టీలు సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.