క్రైమ్/లీగల్
పుల్వామా కేసులో పురోగతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
శ్రీనగర్: నేషనల్ ఇనె్వస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామాలో గత సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీన జరిగిన ఉగ్రవాద దాడి కేసు దర్యాప్తులో మంచి పురోగతిని సాధించింది. 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లను బలిగొన్న ఈ ఉగ్రవాద దాడి కేసు దర్యాప్తు ఇప్పటికే ముగింపు దశకు వచ్చినట్టు కనిపించింది. అయితే, ఎన్‌ఐఏ మంగళవారం నాడు ఈ కేసు దర్యాప్తులో గణనీయమయిన పురోగతిని సాధించింది. ఈ అమానుష ఉగ్రవాద దాడి కుట్రకు ప్రత్యక్ష సాక్షులయిన ఒక వ్యక్తిని, అతడి కుమార్తెను ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో గల హక్రిపొరకు చెందిన తారిక్ అహ్మద్ షా, అతని కుమార్తె ఇన్‌షాజన్‌ను ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. భారీగా పేలుడు పదార్థాలతో నింపి ఉంచిన తన కారుతో వేగంగా సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌లోకి దూసుకెళ్లిన జైషే మొహమ్మద్ ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ దార్ ఈ కిరాతక దాడికి పాల్పడడానికి ముందు తారిక్ అహ్మద్ ఇంటిలో ఒక వీడియోను చిత్రీకరించుకున్నాడు. ఈ ఆత్మాహుతి దాడి జరిగిన తరువాత పాకిస్తాన్ నుంచి ఈ వీడియో విడుదల అయింది. ఎన్‌ఐఏ ఈ వీడియో ఆధారంగా ఆ ఇంటిని గుర్తించి, అందులో నివసిస్తున్న తారిక్, అతడి కుమార్తె ఇన్‌షాను అరెస్టు చేసింది. వృత్తి రీత్యా ట్రక్కు డ్రైవర్ అయిన తారిక్ తన ఇంటిని పుల్వామా ఆత్మాహుతి దాడికి పాల్పడిన జైషే ఉగ్రవాది దార్, పాకిస్తాన్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు మొహమ్మద్ ఉమర్ ఫరూక్ (శక్తివంతమయిన పేలుడు పరికరాలు తయారు చేయడంలో నైపుణ్యం ఉన్న టెర్రరిస్టు), కమ్రాన్, పుల్వామాకు చెందిన జైషే ఉగ్రవాది సమీర్ అహ్మద్ దార్, పాకిస్తాన్‌కు చెందిన మరో ఉగ్రవాది ఇస్మాయిల్ అలియాస్ ఇబ్రహీం అలియాస్ అద్నాన్ ఉపయోగించుకున్నారని ఇంటరాగేషన్‌లో వెల్లడించాడు. అయితే, పాకిస్తాన్‌కు చెందిన ఉమర్ ఫరూక్, కమ్రాన్ తరువాత భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. షా తన ఇంట్లో ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చాడు. ఉగ్రవాదులు ఆ ఇంట్లో ఉండి సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై దాడికి పథకం రూపొందించారు. ఆ ఇంట్లోనే ‘్ఫదారుూన్’ (ఆత్మాహుతి బాంబర్) ఆదిల్ అహ్మద్ దార్‌పై ఒక వీడియోను చిత్రీకరించారు. పుల్వామా ఉగ్రవాద దాడి జరిగిన తరువాత జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ పాకిస్తాన్‌లో ఈ వీడియోను విడుదల చేసిందని ఎన్‌ఐఏ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. తారిక్ కుమార్తె ఇన్‌షా (23) కూడా ఉగ్రవాదులకు ఆహారం సమకూర్చడంతో పాటు వారికి ఇతరత్రా సహాయపడిందని ఆయన వివరించారు. 2018-2019 మధ్య కాలంలో సుమారు 15సార్లు ఉగ్రవాదులు ఆ ఇంట్లో ఉన్నారని, వచ్చినప్పుడల్లా రెండు నుంచి నాలుగు రోజుల పాటు ఆ ఇంట్లో బస చేసేవారని ఆయన వివరించారు.