క్రైమ్/లీగల్

బైక్ దొంగ అరెస్టు- 40 వాహనాలు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉయ్యూరు, మార్చి 3: జిల్లాలోని పలు ప్రాంతాలలో పార్కింగ్ చేసిన మోటారు సైకిళ్ళను దొంగిలించే నిందితుడిని పోలీసులు మంగళవారం అరెస్టు చేసి అతని వద్ద నుండి 40 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ పోలీసు కమీషనరేట్ లా అండ్ ఆర్డర్ జోన్-1 డిసిపి వి హర్షవర్ధన రాజు స్థానిక పట్టణ పోలీస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కేసు వివరాలు వివరించారు. ఉయ్యూరు పట్టణ పోలీస్టేషన్ పరిధిలో 19, రూరల్ స్టేషన్ పరిధిలో 4, కంకిపాడు పరిధిలో1, పమిడిముక్కల 4, తోట్లవల్లూరు స్టేషన్ పరిధిలో 2, ఉంగుటూరు పరిధిలో 1, మాచవరం పరిధిలో 2, గవర్నర్‌పేటలో 1, గుడివాడ, పామర్రు, ఘంటసాల స్టేషన్‌ల పరిధిలో ఒకొక్కటి బైకు పోయినట్లు ఫిర్యాదులు అందాయని, దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కమీషనర్ ఆఫ్ పోలీసు ద్వారకా తిరుమలరావు ప్రత్యేక టీంను పరిశోధనకు నియమించారని చెప్పారు. పరిశోధనలో భాగంగా గస్తీని ముమ్మరం చేసి ముఖ్యంగా అంతర్ జిల్లా, అంతర్ రాష్ట్ర నేరస్థులతో పాటు పాత నేరస్థులు, జైలు నుంచి విడుదలైన వారు, అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచామని తెలిపారు. ఫలితంగా పామర్రు మండలం మల్లవరం గ్రామానికి చెందిన చుండూరు రమేష్ అనే వ్యక్తి ఈ చోరీలకు పాల్పడినట్లు గుర్తించి విచారించగా 37 కేసుల్లో సుమారు రు.13లక్షల విలువ చేసే 40 మోటారు సైకిళ్ళను అతని వద్దనుండి స్వాధీనం చేసుకున్నామన్నారు. దొంగిలించిన బైకులను స్థానిక ఎగినపాడు, నాగన్నగూడెం గ్రామాలలో దాచి ఉంచాడని, నిందితుడు గతంలో విలేఖరిగా పనిచేసినట్లు, జి కొండూరు మండల స్టేషన్‌లో ఇతను ఛీటింగ్ కేసులో అరెస్టయి, జైలుకు వెళ్ళి వచ్చాడని వివరించారు. సులువుగా డబ్బులు సంపాదించేందుకు బైకు దొంగతనాలే మార్గంగా నిందితుడు ఎంచుకున్నారన్నారు. ఈ కేసు దర్యాప్తులో ప్రతిభ కనబరచిన ఉయ్యూరు సిఐ నాగప్రసాద్, పట్టణ ఎస్‌ఐ గురుప్రకాష్ సిబ్బందిని ఆయన అభినందించారు. ఇళ్ళకు తాళాలు వేసి పొరుగూరు వెళ్ళేవారు పోలీసులకు సమాచారం అందించాలని, బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు.