క్రైమ్/లీగల్
వాయిదాను అడ్డుకోలేం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీ ప్రభుత్వానికి స్వల్ప ఊరట లభించింది. కరోనా వైరస్ తీవ్రత దృష్ట్యా స్థానిక సంస్థల ఎన్నికలను ఈసీ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల వాయిదా విషయంలో జోక్యం చేసుకోలేమన్న సుప్రీం కోర్టు ధర్మాసనం ‘కోడ్’ ఎత్తివేయాలని ఆదేశించింది. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసిన అంశంలో జోక్యం చేసుకునేందుకు ప్రధాన న్యాయమూర్తి బాబ్డే సారధ్యంలోని ధర్మాసనం తిరస్కరించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి(కోడ్) అమలును వెంటనే నిలిపివేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి స్థానిక సంస్థల ఏన్నికల నిర్వహణను ఆరు వారాల పాటు వాయిదా వేయటంపై తాము జోక్యం చేసుకునేందుకు ఎలాంటి కారణం కనిపించటం లేదని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి శరద్ అర్వింద్ బాబ్డే, న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, సూర్యకాంత్‌తో కూడిన ధర్మాసనం
స్పష్టం చేసింది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనేది రాష్ట్ర ఎన్నికల సంఘం పరిధిలోని అంశమని బెంచ్ వ్యాఖ్యానించింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవలసిన అవసరం తమకు లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ ఏపీ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ బుధవారం కోర్టు విచారించింది. ఎన్నికలు ఆరు వారాలు వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్ని నిర్ణయాన్ని సమర్థించిన సుప్రీం కోర్టు కోడ్‌ను ఎత్తివేయడానికి సానుకూలంగా స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వం కోరిన విధంగా ఎన్నికల కోడ్‌ను వెంటనే ఎత్తివేయాలని ఈసీని ధర్మాసనం ఆదేశించింది. కొత్త పథకాలను ప్రవేశపెట్టవద్దని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాకి కోర్టు సూచించింది. కొత్త పథకాలను అమలు చేయటం తప్పనిసరైతే ముందు రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని బెంచ్ స్పష్టం చేసింది. ఆరువారాలు కోడ్ అమల్లో ఉంటే అభివృద్ధి పథకాలకు ఆటంకమంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన వాదనను సుప్రీం కోర్టు సమర్థించింది. ఎన్నికల వాయిదా పడిన అనంతరం ప్రవర్తనా నియమావళిని ఎందుకు కొనసాగించాలని సుప్రీం కోర్టు ప్రశ్నించటంతో పాటు కోడ్‌ను వెంటనే ఎత్తివేయాలని ఆదేశించింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబందించిన కొత్త తేదీలను ప్రకటించిన తరువాత ప్రవర్తనా నిమయావళిని ప్రకటించాలని కోర్టు సూచించింది. అలాగే రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల నిర్వహణకు సంబంధించిన తదుపరి తేదీలు నిర్ణయించే ముందు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. కాగా స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీం కోర్టులో సవాల్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ఈసీ తరపున న్యాయవాది శేఖర్ నపాడే వాదించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించకుండా ఏకపక్షంగా స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసే అధికారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేదని ఏపీ ప్రభుత్వం తరపున న్యాయవాది నాథ్‌కర్ని కోర్టు దృష్టికి తెచ్చారు.