క్రైమ్/లీగల్
అనుమానాస్పద స్థితిలో ఇద్దరు చిన్నారుల మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
చందర్లపాడు: కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామంలో శనివారం ముక్కుపచ్చలారని ఇద్దరు చిన్నారులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కన్నతల్లే కర్కశంగా నీటితొట్టిలో వేసి వీరి ఉసురుతీసిందనే అనుమానాలు వ్యక్తవౌతున్నాయి. ఆమె ఇంట్లో కనిపించకుండా పోవటంతో అనుమానాలకు బలం చేకూరుతోంది. పోలీసుల కథనం ప్రకారం.. ముప్పాళ్ల గ్రామానికి చెందిన కోట నాగేశ్వరావు ఉదయం నందిగామ సంతకు వెళ్లి పనులు చూసుకొని ఇంటికి తిరిగి వచ్చాడు. కాళ్లు, చేతులు కడుక్కోటానికి వరల తొట్టి దగ్గరకు వెళ్లగా అతని మనవరాలు అందులో శవమై కనిపించింది. కంగుతిన్న నాగేశ్వరావు పక్కనున్న మూత వరల దగ్గరకు వెళ్లగా దానిలో రెండో మనవరాలు కూడా శవమై కనిపించింది. అతను బిగ్గరగా కేకలు వేయటంతో చుట్టుపక్కల వారు వచ్చి పిల్లల మృతదేహాలను బయటకు తీశారు. ఆ సమయంలో ఇంటిలో కోడలు జనీత కనపడకపోవటంతో పిల్లలను ఆమె హత్య చేసి ఇంటి నుండి పారిపోయి ఉంటుందని అనుమానిస్తున్నారు. నాగేశ్వరావు కొడుకు అజయ్‌కి జనీతతో ఐదేళ్ల క్రితం పెళ్లి జరిగింది. అజయ్ గ్రామాల్లో చిన్నచిన్న గృహోపకరణాలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. వీరికి మూడు, నాలుగేళ్ల ఇద్దరు పాపలు ఉన్నారు. అజయ్ పని మీద విజయవాడ వెళ్లగా జనీత పిల్లలతో ఇంట్లో ఉంది. భార్యాభర్తలు అన్యోన్యంగానే ఉంటారని, కానీ ఎందుకు హత్యకు పాల్పడిందో తెలియటం లేదని చిన్నారుల తాతయ్య నాగేశ్వరావు కన్నీరు పెట్టాడు. సమాచారం తెలుసుకున్న వెంటనే ఎస్‌ఐ మణికుమార్ సిబ్బందితో వెళ్లి పరిసరాలు పరిశీలించారు. కేసు నమోదు చేసి చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం కోసం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. జనీత కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్‌ఐ వివరించారు.
*చిత్రాలు.. విగతజీవులైన ఇద్దరు చిన్నారులు,
* కన్నతల్లి జనీత (ఫైల్‌ఫొటో)