క్రైమ్/లీగల్

మామను కర్రతో కొట్టి చంపిన అల్లుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శి,సెప్టెంబర్ 17:దర్శి పట్టణంలో సాంబ్రాణి పొగ వేసి జీవనం సాగిస్తున్న చిట్లూరి గాలెబ్ సాహేబ్‌ను తన అల్లుడు పాణెం కరీముల్లా కర్రతో తీవ్రంగా కొట్టి చంపిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. కరీముల్లా డ్రైవర్‌గా పనిచేస్తూ భార్యతో రోజు గొడవలు పడుతుండేవాడు. భర్త మీద అలిగిన భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య మీద కోపంతో కొట్టేందుకు కర్ర తీసుకుని తాగిన మైకంలో మామపై దాడిచేసి తీవ్రంగా కొట్టడటంతో గాయాలు పాలైన గాలెబ్ సాహెబ్‌ను స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా మృతిచెందాడు. మామపై దాడిచేసిన కరీముల్లా పరారీలో ఉన్నాడు. స్థానిక ఎఎస్‌ఐ సాయిరెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదుచేసుకుని దర్యాప్తుచేపట్టారు.