క్రైమ్/లీగల్

గ్రీవెన్స్‌డేలో నిరుద్యోగి ఆత్మహత్యా యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోమవారం కలెక్టర్ సమక్షంలో జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన గ్రీవెన్స్‌డేలో నగర పరిధిలోని నిజాంపేటకు చెందిన నిరుద్యోగి జూగటి సాంబయ్య తన వంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసాడు. 2012లో కోర్టులో తాను ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోగా అన్ని అర్హతలు ఉన్నప్పటికీ తనకు కాకుండ ఇతరులకు అటెండర్ ఉద్యోగం కేటాయించారని, అనేక దఫాలు అధికారులకు విన్నవించినప్పటికీ పట్టించుకోలేదని వాపోయారు. దరఖాస్తు ఇచ్చే క్రమంలో తన వెంట తెచ్చుకున్న బాటిల్‌లోని కిరోసిన్ వంటిపై పోసుకోవడంతో అక్కడ ఉన్న గన్‌మెన్లు అప్రమత్తమై నివారించి అతన్ని పోలీసులకు అప్పగించారు.