క్రైమ్/లీగల్

ఆత్మాహత్యకు పాల్పడిన యువతి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంట్యాడ, అక్టోబర్ 1: మనస్తాపంతో ఇంట్లో ఉరిపోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడిన రామభద్రపురం గ్రామానికి చెందిన ఎఫ్. ఆశాజ్యోతి(20) విశాఖ కెజిహెచ్‌లో చికిత్సపొందుతూ సోమవారం మృతి చెందింది. దీనికి సంబంధించి పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. రామభద్రపురం గ్రామానికి చెందిన ఆశాజ్యోతి వేపాడ మండలం బాణాది గ్రామానికి చెందిన ప్రసాదరావు అనే యువకుడుతో ప్రేమలో పడింది. ఇటీవల ఆశాజ్యోతిని వివాహం చేసుకుంటానని ప్రసాదరావు ఆమె తల్లిదండ్రులకు తెలియజేశాడు. అందుకు ఆశాజ్యోతి తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో మనస్తాపానికి గురైన ఆశాజ్యోతి ఇంట్లో ఉరిపోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న ఆమె తల్లిదండ్రులు జ్యోతిని కాపాడి చికిత్స నిమిత్తం ఎస్.కోట ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ కెజిహెచ్‌కు రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది గంట్యాడ పోలీసులు కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.