క్రైమ్/లీగల్

పోలీసులకు దొంగల సవాల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, అక్టోబర్ 1: ఆత్మకూరు పట్టణంలో మహిళా పోలీస్ కానిస్టేబుల్ ఇంటితో పాటు మరో 5 ఇళ్లలో చోరీలకు పాల్పడి దొంగలు పోలీసులకే సవాలు విసిరారు. పట్టణంలోని ఏకలవ్య నగర్‌లో ఉంటున్న ధనుంజయుడి ఇంటిలో సోమవారం దొంగలు రూ. 6 వేల నగదు, 2 జతల కమ్మలు, ఒక చైన్, 2 ఉంగరాలు, రామలింగారెడ్డి ఇంటిలో రూ. 35 వేల నగదు, వెంకటరమణ ఇంటిలో రూ. 15 వేల నగదు ఎత్తుకెళ్లినట్లు సీఐ కృష్ణయ్య తెలిపారు. అలాగే మహిళా పోలీస్ కానిస్టేబుల్ ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. దీంతో కర్నూలు నుంచి క్లూస్ టీంను రప్పించి చోరీలు జరిగిన ఇంట్లో నమునాలు తీసుకున్నామని, దొంగలను త్వరలోనే పట్టుకుంటామని సీఐ తెలిపారు.
పారిశుద్ధ్య కార్మికులంటే అంత అలుసా!